వాళ్లిద్దరూ కలిస్తే.. బ్లాస్ట్
‘పేట్రియాట్’ పేరుతో చేతులు కలిపారు మలయాళ అగ్ర కథానాయకులు మమ్ముట్టి, మోహన్‍లాల్. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. మహేశ్ నారాయణన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‍ను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది చిత్ర బృందం. దేశభక్తి నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‍గా దీన్ని తీర్చిదిద్దినట్టు టీజర్‍తో స్పష్టమవుతోంది. ‘ఒకానొక సమయంలో వాళ్లిద్దరూ దేశాన్ని కంట్రోల్ చేసేవారని నాకు మా నాన్న చెప్పడం ఇంకా గుర్తుంది. ఏళ్లు గడిచే




