వచ్చిందే చేస్తానంటే ఎలా?

నాయికలదీ ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. ఎవరి అభిరుచులు వారివి. అయితే, ఇప్పటి కథానాయికలు ఇదివరకటి మాదిరిగా తమ షూటింగ్‍ పార్ట్లో పాల్గొని.. ఆనక పేకప్‍ చెప్పేసి సైలెంట్‍గా వెళ్లిపోవడం లేదు. తమ మనసులోని ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. అవెంతో ఆసక్తికరంగానూ, ఆశ్చర్యకరంగానూ ఉంటున్నాయి. సాధారణంగా ‘నాకు వచ్చిందే చేస్తాను. ఏది నప్పుతుందో ఆ పాత్రనే ఒప్పుకుంటాను’ అనే మాటలు సినీ పరిశ్రమలో వినిపిస్తుంటాయి. అయితే, రకుల్‍ప్రీత్‍సింగ్‍ మాత్రం అలాంటి ధోరణి

రైతుకు సాయం విశాల హృదయం..

‘రైతుల పేరుతో ఊరకే డైలాగులు చెప్పడం కాదు. వసూళ్లలో ఎంతో కొంత రైతులకు ఇస్తేనే సంతోషం. నేను నటించిన ‘అభిమన్యు’ సినిమాపై తెగే ఒక్కో టికెట్‍పై రూపాయి చొప్పున రైతులకు అందచేయాలని నిర్ణయించుకున్నా’ అని ప్రకటించాడు యువ నటుడు విశాల్‍. ఈయన నటించిన ‘అభిమన్యు’ తెలుగులోనూ మంచి టాక్‍ తెచ్చుకుంది. ఇది తమిళం, తెలుగుతో పాటు నార్త్ ఇండియాలోనూ ఆదరణ పొందింది. ఈ ఆనందంలో విశాల్‍ తమిళనాడులో ఈ సినిమాకు

అసలేం జరుగుతోంది

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రాజమౌళి- జూనియర్‍ ఎన్టీఆర్‍- రామ్‍చరణ్‍ కాంబినేషన్‍లో రానున్న సినిమాపైనే అందరి కళ్లూ పడ్డాయి. ఈ సినిమా గురించి రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. కానీ, అవేమీ నిజం కాదనే వార్తలూ వస్తున్నాయి. మొత్తానికైతే ఈ క్రేజీ కాంబినేషన్‍పై ఉన్న అంచనాలు అన్నీఇన్నీ కావు. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి చాలా గోప్యం పాటిస్తున్నారు. అది మరింత ఎక్స్పెక్టేషన్స్కు కారణమవుతోంది. ‘బాహుబలి’ సమయంలోనే ఈ యువ హీరోలిద్దరికీ రాజమౌళి

అది మాత్రం మిస్ కాను

షూటింగ్‍లో చిన్న గ్యాప్‍ దొరికితే చాలు పుస్తకాల్లోకి తలదూర్చేసే తార రాశిఖన్నా. ఇండస్ట్రీలో ఈమెకు పుస్తకాల పురుగు అని పేరు. మన జీవితం కూడా అందమైన పుస్తకంలా ఉండాలని అంటోందీమె. మన జీవిత పుస్తకంలో ప్రతీ పేజీ అందంగా ఉండాలనే ఆశేం లేదు. కాకపోతే ప్రతి అక్షరం, ప్రతి పేజీ మనం రాసుకున్నదే అనే భావన కలిగితే చాలని అంటోంది. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ మనసు చెప్పినట్టే నడుచుకుంటానని చెబుతున్నా ఈ

వర్మ దారి వర్మదే

జయాప•యాలతో సంబంధం లేకుండా వరుసగా చిన్నా పెద్దా సినిమాలు చేసుకుపోవడం రాంగోపాల్‍వర్మ శైలి. ఇటీవలే నాగార్జునను ‘ఆఫీసర్‍’గా చూపించిన ఈయన తాజాగా ‘వైరస్‍’ పేరుతో సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముంబై నేపథ్య కథలో ఈ చిత్రం రూపొందనుందట. ముంబైకి చెందిన ఓ విద్యార్థి మధ్య ఆఫ్రికాకు వెళ్లి ఓ వైరస్‍ బారిన పడతాడు. తిరిగి ముంబైకి రావడంతో అతని నుంచి ఆ వైరస్‍ ఇతరులకూ వ్యాపించి మొత్తం ముంబై

Top