కావాల్సినవి: బాస్మతీ అన్నం: ఒకటిన్నర కప్పు, నూనె: పావు కప్పు, దాల్చినచెక్క: చిన్న ముక్క, లవంగాలు: అయిదు, అనాసపువ్వు: ఒకటి, వెల్లుల్లి తరుగు: పావుకప్పు, ఎండుమిర్చి గింజలు: రెండు చెంచాలు, సోయాసాస్: టేబుల్‍స్పూన్, క్యారెట్ తరుగు: అరకప్పు, తగినంత, ఉల్లికాడల తరుగు: పావుకప్పు, వెన్న: చెంచా.
తయారు చేసే విధానం: స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేసి.. వెల్లుల్లి తరుగును వేయించుకోవాలి. తరువాత దాల్చినచెక్క, లవంగాలు, అనాసపువ్వును కూడా వేసి వేయించి ఎండుమిర్చి గింజలు వేయాలి. ఇప్పుడు సోయాసాస్, తగినంత ఉప్పు వేసి స్టవ్‍ను కట్టేయాలి. ఇదే కడాయిలో మిగిలిన నూనె వేసి క్యారెట్, బీన్స్, క్యాబేజీ తరుగులు వేయించుకుని చేసి పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమం, ఉల్లికాడల తరుగు, అన్నం వేసి అన్నింటినీ వేయించి స్టవ్‍ను కట్టేయాలి. బయటి ఫ్రైడ్‍రైస్‍లు తినే బదులు ఇంట్లోనే ఇలా చేస్తే ఇది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.
Review చిల్లీ గార్లిక్ ఫ్రైడ్‍రైస్.