రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
వ్యాపారంలో కొంత ప్రతికూలత, సామాన్య ఫలితములు, శత్రుమూలక ధననాశము. బంధువైరం, ప్రయాణ అసౌఖ్యం, గృహసౌఖ్యం తగ్గుట, శరీరమందు ఉష్ణతాపములు. సుబ్రహ్మణ్య ఆరాధనచే శారీరక మానసిక ఆందోళనలచే విముక్తి.

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
సంతానం విషయంలో ముందంజ, ధనలాభము, ఇష్టకామ్యసిద్ధి. శరీరమున రోగములు తోలగి సౌఖ్యములు, బంధు మిత్ర సమాగమము. మనస్సునకు ఉల్లాసము. గృహమునకై జేయు ప్రయత్నములు అంతగా ఫలించవు. ధనాగమము, సంతోషము.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
జన్మరాశి యందు శుక్రుడు శరీర ఆరోగ్యం, భోగభాగ్యములు, కవిత్వము, వాక్చాతుర్యం, న్యాయ సలహాలు ఇచ్చుట, తనకో వర్గమును తయారుచేసుకొనుట, శత్రునాశనం. అలంకార ప్రియత్వము, ఖచ్చితత్వము, వృత్తి వ్యాపారాల్లో విజయం.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యాపారాల్లో అధిక మొత్తంలో లాభం. ఇతరులకు మార్గదర్శకులవుతారు. పిల్లల విద్యావిషయంలో ధనం ఖర్చు చేస్తారు. మీరు చేసే వృత్తి వ్యాపారాలలో మీదే పై చేయి. ప్రారంభంలో కలహములు. ద్వితీయార్థం ఉష్ణ సంబంధ అనారోగ్యం.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గృహ వాతావరణం అనుకూలము. శుభకార్యక్రమాల్లో బంధుమిత్రుల కలయిక, ఆనందం. కొత్త పరిచయాలు. ఆదాయ మార్గాలు మెరుగు. తగిన ఖర్చు. భోజనసౌఖ్యం, నూతన వ్యాపారానుకూలత. క్రొత్త వ్యక్తులతో భాగస్వామ్యం.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
ఆధ్యాత్మికంగా ముందుంటారు. తేజస్సు, శరీర ఆరోగ్యం మెరుగు. చేసే వృత్తి వ్యాపారాలలో అధికలాభం. గతంలో బాకీలు వసూలు. వ్యవసాయదారులకు హుషారు. కూరగాయలు, పండ్ల వ్యవసాయదారులకు. వర్తకులకు లాభం.

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
రాజకీయపరమైన వ్యవహారములు అత్యంత చాకచక్యంగా నెరపగలరు. మీమాట సహాయము కొఱకు అందరూ ఎదురు చూస్తారు. గృహమున పుణ్యకార్యములకై ధన ఖర్చు. జపహోమాదులు జేయుదురు. చిరకాల కార్యములు పూర్తి.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష
నిరపరాధముగా కలహములు తన దోషము లేకనే ద్రవ్యము నశించుట, ప్రారంభంలో చేయు వృత్తి వ్యాపారములు ప్రతికూలము, రెండవ భాగములో ఉపశమనం కలిగి పోయిన ద్రవ్యం దొరుకును. చేయు వ్యాపారములందు లాభము.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
శుభాశుభ మిశ్రమములు, పనియందు అలసత్వము వదలును. కార్యదీక్షతో ముందుకు నడచుదురు. కార్యసాధనకై పై అధికారులను సందర్శించుట, ఒత్తిడికి లోనగుదురు. నూతన వ్యాపారావకాశములు లాభిస్తాయి. యత్నకార్యసిద్ధి.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
గృహమున శుభకార్యనిర్వహణ, పుణ్యక్షేత్ర సందర్శన మానసిక ఆనందము, తలపెట్టిన కార్యక్రమములు సక్రమంగా నిర్వర్తించుట బంధుజనులతో ఆనందము.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
యత్నకార్యసిద్ధి, సుఖసంతోష జీవనము, ధనధాన్య వస్త్రాది లాభములు, వస్తు భూషణాదిచయములు, చేయు వృత్తి వ్యాపారములలో లాభము పెరిగి నూతన గృహారంభము నిర్మాణము యోచన చేయుదురు. అన్నింటా కలసి వస్తుంది.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
గృహమున శుభకార్యనిర్వహణ, అందరికీ చేయూతగా నుండుట, శ్రమకు ఓడ్చి కార్యభారము నిర్వర్తించి పదిమందిచే ప్రశంస. కార్యనిమగ్నులై, పరోపకారం, వృత్తి వ్యాపారములందు నైపుణ్యత, అందరి ఆదరాభిమానమును చూరగొనుట.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top