రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
ధన లాభము, చుట్టములకు ప్రమాదములు, స్వస్థానమును విడిచి వెళ్ళుట, ఇతరులతోమాట పట్టింపులు.

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ధన లాభము, ద్రవ్యలాభము,ఇష్టకామ్యార్థసిద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి, సంతానం అభివృద్ధిలోనికి వచ్చుట, గృహమున ఆనంత ఆహ్లాదకరమగు వాతావరణములు, అధికార వృద్ధి, ఇతరులచే గౌరవింపబడుట మొదలగు యోగములు కలవు.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, అర్థ్రపునర్వసు 1,2,3 పాదాలు
వాహన విషయాల్లో జాగ్రత్త మార్గావరోధములు ఏర్పడవచ్చు. నిరపరాధంగా ఇతరులచే తిట్లు తినవలసి వస్తుంది. కుటుంబ విషయాలు ప్రోత్సాహకరముగా ఉంటాయి. మాసాంతంలో పుణ్యక్షేత్ర సందర్శనములు, దైవారాధనలు.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పూర్వీకుల నుండి సంప్రాప్తించిన ఆస్తిలో కొంత భాగము ఖర్చగుట, అధికార పరిధి విస్తరింపబడుట, సాహస కార్యములు చేయుట, క్రీడల యందు ఆసక్తి, శుక్రునికి భాగ్యమందు మరియూ ఉచ్చస్థితి కలుగుటచే వస్త్ర లాభము, సన్మానములు, గౌరవం.

సింహం: ముఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కుటుంబ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇంటికి సంబంధించి మార్పులు, చేర్పులు చేస్తారు. ఖర్చులు అధికమవుతాయ. ధనం నిల్వ తగ్గుతాయి. దర్జాగా ఉండగలుగుతారు. బంధుమిత్ర సమాగమము ఇంట పండుగ వాతావరణం.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
అనుకూల గ్రహస్థితి వలన సంచి లాభము, చిల్లు తీర్చినట్లు గతంలో చేసిన బాకీలు తీర్చుకోవడం సరిపోతుంది. ఐతే ఆర్థికంగా ముందంజ వేస్తారు.

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
చేతి వృత్తి వారలకు అనేక రెట్లు లాభం. చేతి నిండా ధనం, ధనమునకు లోటు లేదు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. చేపలు, రొయ్యలు వ్యాపారులకు సువర్ణావకాశం. షేర్లు కూడా అనుకూలిస్తాయి. ధనాదాయము పెరుగుతుంది.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, శ్యేష
విద్యార్థులు సమర్థవంతంగా చదివి సరస్వతీ కటాక్షం పొంది పరీక్షలలో విజయం సాధిస్తారు. వేద, జ్యోతిష, ఉన్నత విద్య కలసి రావడం, మంచి అవకాశములు, ఆదరణ, ఆధ్యాత్మిక భావం ఉన్నతిలోనికి వచ్చుట, సంపూర్ణ దైవబలం, కుటుంబమున పండుగ వాతావరణము నెలకొంటుంది.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
కార్య విలంబనము జరుగును. అనుకున్న పనులు ఆలస్యమవుతాయి. గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. ఇష్ట దేవతా సందర్శనం ఆల్యమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. మాట తొందర మీ వ్యాపారాన్ని దెబ్బ తీయవచ్చును. నెలాఖరులో ఆదాయ వనరులు పుష్కలంగా పెరుగుతాయి. చేతి నిండా డబ్బు సంపాదిస్తారు. పంట వృత్తుల వారికి అధిక ఆదాయం వస్తుంది.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
స్వల్ప అనారోగ్యము మీ వాహనములు చోరుల పాలు అగుటకు అవకాశము. కొన్ని విషయాలలో మొండితనం వల్ల సమస్యలు. మానసిక క్షోభ కాముకత్వం, ధన వ్యయము అగును.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
పనుల ఒత్తిడి, తొందరపాటు చర్యలు, ఆందోళన, ఒక్కోసారి తీవ్రకోపము, అనాలోచిన నిర్ణయాలు, జన్మరాశి యందు కేతువు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించును. సోదర మూలక సహాయము. అభివృద్ధి కలుగుతుంది.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అకాల భోజనము, బంధు మిత్రులతో బేధాభిప్రాయములు, జన్మరాశి యందు రవి, బుధ, శుక్ర మూడు గ్రహముల సంచారము వలన ఈ కాలమున అధికార యోగ్యతలు, కంఠము బిగ్గరగా చేసి మాటలాడుట, అవసరము లేని చోట అధికముగా ప్రసంగించుట పెద్దలను విడచి ప్రావాసము.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top