రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం
కుజ సంచారము యోగదాయకము. ధన వస్తు భూ లాభములు. క్రయ విక్రయ లాభములు. పుణ్య సంప్రాప్తము. గృహ వాతావరణము అనుకూలము. విద్య సాంస్క•తిక విషయాల్లో ముందంజ. విద్యార్థులకు కలసి వచ్చే కాలం.

వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు
ఎప్పటినుంచో నిలచిన పనులు ఫలవంతమై క్రొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగు. మిత్రుల తోడ్పాటు, పదిమందిలో గుర్తింపు, విందు విహారయాత్రలు, ఆలోచన విధానం మెరుగు.

మిథునం: మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర పునర్వసు 1,2,3 పాదాలు
ప్రారంభంలో మాట పట్టింపులు, ధనధాన్య వృద్ధి, రచనా వ్యాసంగాల్లో విశేష ప్రతిభ. చేయు వృత్తి వ్యాపారాలలో లాభం. సోదరులు వృద్ధి పథంలో ఉంటారు. క్రొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. శ్రమ చేసి పనులను పూర్తి చేస్తారు.

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేషా
విద్యా విషయాల్లో ముందంజ, గుర్తింపు, ఉన్నత విద్యాయోగములు. శుభకార్య నిర్వహణ, గృహమందు శుభపరంపరలు, శుభకార్యములకై ధనాన్ని విరివిగా ఖర్చు పెడతారు. పదిమందిలో ముందుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదాలు
సునాయాసంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తుల విలువ వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ రంగములలో జయం, అందరికి ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు. సభలు సమావేశాలు.

కన్య: ఉత్తర 2,3,4 పాదాలు. హస్త,చిత్త 1,2 పాదాలు
విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో పరీక్షలలో ముందంజ. వివాహ విషయాలు ఆలస్యం. గృహం కొనుగోలు కోసం చేసే యత్నాలు లేటు. సంతాన విషయంలో శ్రద్ధ వహిస్తారు. దాన ధర్మాలు హోమాది క్రతువులు నిర్వహిస్తారు.

తుల: చిత్త 3,4 పాదాలు. స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
కోపము, అకాల విరోదములు, అస్థిమితములు, ధనవ్యయము, గృహమున అపవాదములు, కార్యభంగమలు చెడువార్తలు వినుట, మనస్సునకు ఆందోళనలు, రాజకీయంగా అంత అనుకూలము కాదు.

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష
తీర్థయాత్రలకై ధనవ్యయం, త్రిప్పట, అసౌక్యం. సత్తువలేని భోజనము, ఉద్యోగములో మాటలుపడుట, ప్రతివిషయంలో ఆచితూచి వ్యవహరించుట మేలు.

ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదాలు
రుణములను తీర్చుటకు కష్టపడి పనిచేసి ధనం సంపాదిస్తారు. ధర్మ మార్గంలో నడచుకుంటారు. ఆధ్యాత్మికచింతన కూడా పెరుగుతుంది. సమస్త దోషములు తొలగి సలలైశ్వర్యములు కలుగుతాయి. ప్రతిభచే అందనిపీ మెప్పిస్తారు.

మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు
ఆర్థిక పరిస్థితులు మెరుగు. మానసికోల్లాసం,ఉత్సాహం. అప్పుడప్పుడు చండాల లక్షణాలను ప్రదర్శిస్తారు. మానసికంగా హెచ్చుతగ్గులుంటాయి. ఆధ్యాత్మిక గ్రంథ పఠనం. పాడి పశువులను పెంచడానికి సుముఖత చూపుతారు.

కుంభం: ధనిష్ఠ 3,4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ విషయాల్లో పరిస్థితులు మెరుగవుతాయి. అవివాహితులకు వివాహములు. చుట్టరికాలు కలసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నం సఫలం. భూమి ధరలు పెరిగి మానసికోల్లాసం. వ్యవసాయం ఫలప్రదం.

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వైద్యముకై వెచ్చించవలసి వస్తుంది. ఇంట్లో పెద్దలకు గాని, కళత్రమునకు గాని మలేరియా దోమకాటు సంబ్ణధ ఆరోగ్య సమస్యలుండవచ్చును. వైద్య చికిత్సలు. వారి ఆరోగ్యం కుదుట పడుతుంది. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.

Review రాశి ఫలాలు.

Your email address will not be published. Required fields are marked *

Top