నేనే శివుడు.. శివుడే నేను!

భగవంతుడిని, భక్తుడిని అనుసంధానించేది ‘మంత్రం’. మంత్రంలో భగవంతుడి సర్వశక్తులు నిబిడీకృతమై ఉంటాయి.
మంత్రంలో ‘మన’ అంటే మనసు.
త్ర అంటే బట్వాడా చేయడం. అంటే శక్తిని ప్రసరింప చేయడం.
ఒక మంత్రాన్ని సరిగా నేర్చుకుని, అర్థం చేసుకుని, శ్రద్ధగా జపిస్తే అది అనవసర కోరికల వల్ల కలిగే అలజడి, అశాంతి నుంచి మనిషిని విముక్తం చేస్తుంది.
సర్వ మంత్రాలలోనూ శివ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. వాటిని చదివి అర్థం చేసుకుని జపించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.

ఓం నమ: శివాయ।।
‘నేను శివుడికి నమస్కరిస్తున్నాను’ అని పై మంత్రానికి అర్థం. అయితే లోతుగా అన్వేషించినపుడు, ఈ మంత్రం యొక్క విస్త•తార్థం మరో అంతరార్థాన్ని బోధిస్తుంది.
‘నమ:’ అంటే ‘నేను అహంకారం కాదు. శివుడను’. అంటే- నేను శివుడిని తప్ప మరెవరినీ కానని అర్థం.
‘నమ:’ అనే పదం నమస్కారం లేదా ఆరాధనను సూచిస్తుంది. కానీ, నమహ: అనే పదాన్ని ‘నా’ మరియు, ‘మహా’గా విభజించినపుడు అది ‘నాది కాదు’ అనే అర్థాన్నిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే, ‘నేను నా వాడిని కాదు. అంటే నేను నేను కాదు. నేను విభుడకు లోబడి ఉన్నవాడిని. నేను శివుడికి చెందిన వాడిని. ఏదీ నాది కాదు. నేను శివుడిలో లయమై ఉన్నాను. శివుడు నాలోనే ఉన్నాడు’ అని అంతరార్థం.
ఓం నమ: శివాయ అనేది పంచాక్షరీ మంత్రం. ఇది పంచభూతాలకు ప్రతీకాత్మమైన మంత్రం. సృష్టి యావత్తూ ఈ మంత్రంలోనే ఉంది. మానవ శరీరం, పర్వతాలు, చెట్లు.. ఇలా అన్నీ నీరు, గాలి, వాయువు, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలతో సృష్టించబడినవే. మనిషి వాటిలోనే లయమవుతూ, వాటిలోనే పుడుతూ ఉంటాడు. ఇవన్నీ శివుడి ఆధీనంలో ఉంటాయి. అటువంటి శివుడిలో నేను విడదీయరాని అంశం అనే విషయాన్ని ఆరాధకుడు గ్రహిస్తే ఈ మంత్రార్థం జీవితాన్ని చరితార్థం చేస్తుంది.
ఇక, రుద్ర గాయత్రీ మంత్రార్థాన్ని గురించి తెలుసుకుందాం.

ఓం తత్పురుషాయ విద్మహే
మహాదేవాయ ధీమహీ
తన్నో రుద్ర: ప్రచోదయాత్‍

‘నేను గొప్ప పురుషుడిని ధ్యానిస్తున్నాను. ఓ సర్వోన్నతుడా (శివా)! నాకు ఉన్నతమైన బుద్ధిని ప్రసాదించు. నా మనసును ప్రకాశింపచేయుము’ అని పై మంత్రానికి అర్థం. ‘రుద్ర’ అంటే శివుడి యొక్క దివ్య గుణాలలో, రూపాలలో ఒకటి. రాక్షస లేదా పైశాచిక శక్తులు తలెత్తినపుడల్లా, పూర్వపు శక్తులను ఎదుర్కోవడానికి దైవిక శక్తులు పెరుగుతాయని వేదాలలో చెప్పారు. శివుని భయంకర రూపమైన రుద్రుడు అనేది ఆ దివ్యశక్తులకు మూలాధారం.
పై శ్లోకం ద్వారా భక్తుడు పరమశివుడిని ధ్యానిస్తూ ఉన్నతమైన బుద్ధిని కోరతాడు. తన మనసును ప్రకాశవంతం చేయాలని ప్రార్థిస్తాడు. ఉన్నత అంటే అధిక అని అర్థం. ఉన్నతమైన బుద్ధి ఉంటే అధికమైన తెలివి. ఇదే ఇక్కడ ముఖ్యమైనది. ఇంద్రియ తృప్తి కోసం సంపదను, సంపదలను కూడగట్టుకోవడంలో నిమగ్నమైన ప్రాపంచిక తెలివికి ఉన్నతమైన తెలివి భిన్నంగా ఉంటుంది. అల్పకాలిక భౌతిక సుఖదు:ఖాల కంటే అంతిమ ఆనందం కోసం ఒకరి అన్వేషణ గురించిన విచారణలతో ఉన్నతమైన మేధస్సు ముడిపడి ఉంటుంది. అంతిమ ఆనందం అనే ఆధ్యాత్మిక పానీయాన్ని, అత్యున్నత భౌతిక శ్రేయస్సును పొందడానికి సర్వ మంగళకరమైన శివుడిని ధ్యానించడం ఈ శ్లోకంలోని అంతరార్థం.
ఓం త్య్రంబకం యజామహే
సుగంధిం పుష్టివర్ధనమ్‍
ఉర్వారుకమివ బంధనాన్‍
మృత్యోర్ముక్షీయ మమృతాత్‍
‘మూడు కన్నుల సువాసన గల భగవంతుడిని మేము పూజిస్తాము. అతడు సమస్త ప్రాణులను పోషించేవాడు. పెరిగిన దోసకాయ తన బంధం (తీగ) నుంచి విడివడినట్టే (విముక్తి పొందినట్టే) అమరత్వం కోసం ఆయన మనలను మరణం నుంచి విడిపించు గాక’ అని పై శ్లోకార్థం.
‘మృత్యు’ అంటే మరణం. ‘జయ్‍’ అంటే విజయం. మృత్యుంజయ మహాదేవుడిని ఆరాధించడం ద్వారా ఎవరైనా ఈ భౌతిక ప్రపంచంలోని అకాల బాధలు, ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ఎందుకంటే శివుడిని భక్తితో పూజిస్తే జరా మరణ బాధలుండవు. మార్కండేయ మహర్షి ఈ మహా మంత్రాన్ని జపించే మృత్యువును జయించాడు.
వెంటనే పరమశివుడు కోపోద్రిక్తుడై, ‘నా మూడో నేత్రాన్ని తెరిచి ఈ సృష్టి మొత్తాన్ని ఇప్పుడే భస్మీపటల
అక్కడే ఉన్న బ్రహ్మదేవుడు శివుడి కోపాగ్నిని చూసి గజగజలాడాడు. భయంతో నిరుత్తరుడై, ‘న
‘నేను అటు పరబ్రహ్మను చేరక, ఇటు ఉన్న చోట ఉండక కిందకు రాక త్రిశంకు స్వర్గంలాంటి జీవితమా నాది?’ అని బ్రహ్మ మనసులోనే అనుకున్నాడు.
అంతలో పార్వతి కల్పించుకుంది.

‘అన్నా! ఈ మాయా నాటకాన్ని నాథుడు (నా భర్త/సృష్టి భర్త)అప్పుడే ముగిస్తాడా?’ అని విష్ణువు వంక చూసి పరిస్థితిని సైగతో చక్కబెట్టమని చెప్పింది.
అప్పుడు విష్ణువు బ్రహ్మ, పార్వతిలను ఉద్దేశించి, ‘మీరేమీ భయపడకండి. నేను యుగాంతంలో సృష్టి విత్తనాలు తీసుకుని వెళ్తాను. మళ్లీ కలియుగంలో మన మాయా నాటకం మొదలుపెడదాం. మా బావ కోపం ఎంత ఎంతసేపు? నేను అనునయిస్తాను కదా! ఇక పదకొండు రోజులే (మహా భారత యుద్ధం మొత్తం పద్దెనిమిది రోజులు జరిగింది. ఈ శివ-కేశవుల కలయిక నాటికి ఏడురోజులైంది) కదా సర్వనాశనం కావడానికి మిగిలింది’ అన్నాడు.
అనంతరం విష్ణువు శివుడితో, ‘బావా! నీకు తెలుసు కదా! సమరమందు నేను ఆయుధం ధరించబోనని. అలా అని అర్జునుడికి మాట ఇచ్చాను. నువ్వు ప్రసాదించిన పాశుపత దివ్యాస్త్రాలు అతడి వద్దే ఉన్నాయి. ఇప్పుడు భారత యుద్ధం రూపంలో ధర్మానికి హాని కలిగింది. నేను ఆ ధర్మరక్షణకే అవతరించిన విషయం నీకు తెలుసు. కొద్దిరోజులు శాంతించు. ఇక తర్వాత పని నీదే కదా! ఆట (నృత్యం) సగంలో ఆపితే పార్వతి బాధపడదా?’ అన్నాడు.
‘సరే! మీ ఇష్టమే నా ఇష్టం. నాకు కావాల్సింది ధర్మస్థాపన. అది ఎలాగూ నువ్వు చేస్తావు కదా త్రివిక్రమా!’ అన్నాడు శివుడు.

‘బావా శివా! యుగాంతం ముగింపు మాత్రం చేసేది నువ్వే. అది నీ చేతుల్లోనే ఉంది. మాయా స్వరూపిణి అయిన నా సోదరి పార్వతి నీ ప్రళయ నృత్యానికి సాక్
నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమ:
నమస్తే అస్తు ధన్వనే బాహూభ్యా మతతే నమ:
(‘ఓ రుద్రా! నీ క్రోధానికి, నీ బాణానికి, నీ ధనస్సుకు, నీ బాహువులకు నమస్కరించెదను. వీటిని మా యందు ప్రయోగింపవలదు’).
విష్ణువు ఇలా ప్రార్థించగానే శివుడు ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. ‘నువ్వు వేరు.. నేను వేరా?’ అని ఆప్యాయంగా పలికాడు.
‘బావా! ఇక నాకు సెలవు ఇస్తావా?’ అని అడిగాడు విష్ణువు.
‘నా చెల్లికి నా ఆశీర్వచనాలు అందచేయి’ అని చెప్పాడు శివుడు.

Review నేనే శివుడు.. శివుడే నేను!.

Your email address will not be published. Required fields are marked *

Top