రెంటికీ చెడిన రేవడి

రేంవడు అంటే రజకుడు. ఈ సామెత పుట్టడం వెనుక ఒక చిన్న కథ ఉంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక రేవు ఉండేది. చాకలి రోజూ ఆ రేవుకు వచ్చి బట్టలు ఉతుకుతుండే వాడు. ఒకరోజు సగం బట్టలు ఉతికి ఒడ్డున ఆరేస్తుండగా, అకస్మాత్తుగా వాగు పొంగింది. ‘అయ్యో! అయ్యో! నా బట్టలు’’ అంటూ అతడు కొట్టుకుపోతున్న బట్టలను పట్టుకోవడానికి వాగులోకి పరుగెత్తాడు. కానీ, అప్పటికే కొన్ని బట్టలు వాగులోకి

వన్స్‌మోర్‌…

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు, ఎవరికి అదృష్టం తలుపు తడుతుందో, అవకాశాలు ఎలా వెతుక్కుంటూ వస్తాయో ఎవరికీ తెలియదు. ఒకపక్క యాభై ఏళ్లు దాటిన హీరోలు వరుసపెట్టి చేస్తున్న సినిమాలు.. ప్రస్తుతం హీరోయిన్ల రేస్‌లో వెనుకబడిపోయిన కొందరు సీనియర్‌ కథానాయికలకు అవకాశాలను తెచ్చిపెడుతున్నాయి. పెద్ద హీరోల పక్కన వారికి తగిన పాతల్ల్రో కనిపించడానికి పాత, సీనియర్‌ హీరోయిన్లకు అవకాశాలు లభిస్తున్నాయి. అలాఅని సీనియర్‌ హీరోయిన్లు వచ్చిన అవకాశాలను వచ్చినట్టు ఒప్పేసుకోవడం లేదు.

చిరంజీవి సినిమా టైటిల్‌తో..

చిరంజీవి హీరోగా చాన్నాళ్ల క్రితం వచ్చిన ‘రాజా విక్రమార్క’ గుర్తుంది కదా! ఇప్పుడు అదే టైటిల్‌తో కార్తికేయ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కార్తికేయ ఓ అండర్‌ కవర్‌ ఏజెంట్‌గా నటిస్తున్నాడు. తాన్యా రవిచంద్రన్‌ అతడి సరసన నటిస్తోంది. శ్రీ సరిపల్లి దర్శకుడు. సాంకేతికంగా ఈ సినిమా అత్యున్నతంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమా టీజర్‌లో కార్తికేయ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

పిల్లను చూసి పెట్టండి

ఇటీవలే ‘పాగల్‌’గా అలరించిన విశ్వక్‌సేన్‌.. తాజాగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విద్యాసాగర్‌ చింతా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్‌` అల్లం అర్జున్‌ కుమార్‌ పాత్రలో కనిపించనున్నాడు. 34 ఏళ్లు దాటినా.. నెలకు రూ.70 వేలు సంపాదిస్తున్నా పెళ్లి కాని యువకుడి పాత్రలో కనువిందు చేయనున్నాడు. ‘తన కోసం అమ్మాయిని చూసి పెట్టాలని, కట్నం వద్ద’ని చెబుతున్న ఈ సినిమా ప్రచార చిత్రం ఇటీవలే

మారేడుమిల్లిలో మళ్లీ ‘పులి’

ఇటీవలే ‘దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక’ అంటూ అదరగొట్టిన అల్లు అర్జున్‌పై మరికొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి చిత్ర బృందం సిద్ధమైంది. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప’ షూటింగ్‌ ప్రస్తుతం ఏపీలోని మారేడుమిల్లిలో జరుగుతోంది. గతంలోపూ ఒక ముఖ్య షెడ్యూల్‌ను ఇక్కడ చిత్రీకరించారు. ప్రస్తుత పార్ట్‌ ముగిశాక హైదరాబాద్‌లో జరిగే మరో షెడ్యూల్‌తో సినిమా షూటింగ్‌ పూర్తవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ‘పుష్ప’ రెండు భాగాలుగా

Top