నువ్వు.. నీ కర్మ

ఒకసారి శిష్యులు రమణ మహర్షిని` ‘నేను చేసే కర్మలకు నిజమైన పరిపూర్ణత రావాలంటే ఏం చేయాలి?’ అని అడిగారు. ‘ఏ తెలివితేటలతో పనిలేకుండానే యావత్తు ప్రాణికోటి జీవిస్తున్నా మనిషి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. తనకు వరంగా సంక్రమించిన తెలివితేటలను చేతులారా అజ్ఞానంగా మార్చుకుంటున్నాడు. మనం కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం అనే బాహేంద్రియాలను సహాయ వస్తువులుగానే చూస్తున్నాం కానీ, వాటికి ఆధారంగా జ్ఞానేంద్రియాల రూపంలో ఉన్న భగవంతుడిని గమనించడం లేదు.

అవీ.. ఇవీ లక్ష్యం మారొద్దు!

కాళీ మాత ఆలయంలో ఒకరోజు భక్తులంతా కలిసి లడ్డూ ప్రసాదం తయారు చేస్తున్నారు. అయితే, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు.. వాళ్లు తయారు చేస్తున్న లడ్డూలకు చీమలు పట్టడం మొదలైంది. రామకృష్ణ పరమహంస చెప్పిన ప్రకారం జీవహింస చేయకూడదు. మరి, ఆ చీమలను ఎలా తొలగించాలనేది వారికి పెద్ద సమస్య అయ్యింది. ‘చీమలను చంపకుండా, వాటిని వదిలించడం ఎలా?’ అని వారంతా ఆలోచనలో పడ్డారు. వాటిని చంపకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్పాలని నేరుగా

ఆరోగ్యభాగ్యం ‘వేగం’.. ఆపితే రోగమే!

ఆరోగ్యభాగ్యం ‘వేగం’.. ఆపితే రోగమే! ఆయుర్వేదం మనకు ప్రకృతి నుంచి లభించే ఔషధాల గురించే కాదు.. అంతకంటే ముఖ్యమైన జీవన విధానం గురించి ఎక్కువ చెప్పింది. ఏ రోగానికైనా మందులు మాత్రమే పరిష్కారం కాదు. కాబట్టి అసలు రోగాలే రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేదే మన ప్రాచీన ఆయుర్వేదం చెప్పింది. రోగం రాకుండా ఉండాలంటే నివారణ మార్గం ఏమిటో సూచించింది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో మందులూ మాకులూ కంటే 69 శాతం జీవన

నా గెలుపు..‘జాన్స్‌క్రీక్‌’కు మలుపు

పరమేశ్‌.. అందరిలాగానే మొదట్లో క్రేజ్‌ కొద్దీ అమెరికా వచ్చారు. కానీ, ఇక్కడ జీవించడం మొదలుపెట్టాక.. ఇక్కడి ప్రభుత్వానికి పన్నులు కడుతూ, పరోక్షంగా జాతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాననే భావన కలిగాక.. దేశంపై ప్రేమ పెంచుకున్నారు. ఇప్పుడు అమెరికాలో జరిగే ఓ కౌంటీ ఎన్నికల్లో పోటీచేస్తూ.. దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని జార్జియా రాష్ట్రంలో పుల్టన్‌ కౌంటీ అనే జిల్లాలో జాన్స్‌క్రీక్‌ సిటీ కౌన్సిల్‌ (నంబర్‌ 4)కు పోటీ చేస్తున్న

కాళిదాసు గర్వభంగం

మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె వద్దకు వెళ్లాడు. ‘దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వండి’ అని గుమ్మం ఎదుట నిలిచి అడుగుతాడు. గుడిసె లోపలి నుంచి ఓ ముదుసలి మహిళ వచ్చి ‘మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు?’ అని ప్రశ్నిస్తుంది. ‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు’ అన్నాడు కాళిదాసు ఒకింత

Top