ఆయుర్వేదం.. వ్యాయామం

వ్యాయామం ప్రాధాన్యత గురించి ఆయుర్వేద గ్రంథంలో విపులంగా వివరించారు. శరీరానికి శ్రమను కలిగించే పనినే వ్యాయామం అంటారు. వ్యాయామం నిత్యం చేయడం వల్ల శరీరం కాంతివంతంగా ఉంటుంది. వ్యాయామం మంచి ఆకలి పుట్టిస్తుంది. సోమరితనం, బద్ధకం దరిచేరవు. శరీరం నిర్ధిష్ట ఆకృతి కలిగి ఉంటుంది. శ్రమించడానికి అవసరమైన శారీరక శక్తి, మానసిక శక్తి లభిస్తాయి. శరీరం ఉష్టంగానూ, శీతలంగానూ కాకుండా కాపాడుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. వ్యాయామం నిత్యం చేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు. అల్ప జంతువులు

తెలుగు ‘పాట’వం మా రేడు నీవని..

భక్త కన్నప్ప’.. ఈ తెలుగు సినిమా చూడని వారుండరంటే అతిశయోక్తి కాదు. బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు, వాణిశ్రీ జంటగా 1976లో రూపుదిద్దుకున్న ఈ తెలుగు భక్తిరస ప్రధాన చిత్రం అప్పట్లో సూపర్‌డూపర్‌ హిట్‌. గోపీకృష్ణ పతాకంపై కృష్ణంరాజు సోదరుడు యూవీ సూర్యనారాయణరాజు ఈ సినిమాను నిర్మించారు. రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, బాలయ్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ప్రధానంగా ఈ సినిమాలోని ‘శివ శివ శంకర.. భక్త వశంకర’ అనే పాట

ఆయుర్వేదం.. ఆరోగ్యం

నవంబర్‌ 2, 2021 ` జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఆయుర్వేదం అంటే..? ఆయుర్వేదం అంటే` ఆయుష్షును గురించి తెలిపే శాస్త్రం. హితాం హితం సుఖందు:ఖ మాయుస్తస్య హితాహితమ్‌ మానంచ తచ్చ యతఓక్త మాయుర్వేద: స ఉచ్యతే ఆయుష్షుకు హితమైనది, అహితమైనది ఏమిటో తెలిపేదీ, సుఖమును కలిగించేది ఏదో, దు:ఖాన్ని కలిగించేది ఏదో వివరించేది మాత్రమే కాక, ఆయుష్షు పరిమితిని కూడా తెలియచెప్పే శాన్త్రమే ఆయుర్వేదం. ఆయుర్వేదం వల్ల మానవ జీవనానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఆయు: కామయమానేన, ధర్మార్థ సుఖసాధనం ఆయుర్వేదోపదేశేషు విధేయ: పరమాధర: ఆయువు గురించి

ఆధ్యాత్మి‘కథ’

నీచ స్నేహితుడు నీచబుద్ధి కలిగిన స్నేహితుడి వల్ల మనకు ఆపదలు వస్తాయి. సాయం చేసే గుణం ఉన్న వాళ్లను చూసి ఓర్చుకోలేని వాళ్లు తమకు తెలియకుండానే ఇతరులకు హాని చేస్తారు. అలాంటి వారితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని తెస్తుంది. అలాంటి స్నేహితుడి వల్ల ప్రాణాలను పోగొట్టుకున్న హంస కథ ఇది. మహేంద్రపురంను ఆనుకుని ఉన్న అడవిలో ఓ హంస, పావురం ఎంతో స్నేహంగా ఉండేవి. హంస పున్నమి నాటి చంద్రునిలా తెల్లగా నిగనిగలాడుతూ

ఆయుర్వేదం` రసాయన చికిత్స ఉపయోగాలు

ఆయుర్వేదం సూచించిన మేరకు ఆహార, విహార, ఔషధ గుణాల నియమాలను పాటిస్తే కలిగే ప్రయోజనాలివి.. ి` రసాయన చికిత్స మనుషుల్ని తరుణ వయస్కులుగా చేస్తుంది. ` జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ` బుద్ధి, ధారణశక్తి పెరుగుతాయి. ` శరీరం మంచి వర్ఛస్సు, కాంతిని సంతరించుకుంటుంది. ` మంచి, మధురమైన కోకిల వంటి స్వరం లభిస్తుంది. ` దేహబలం పెరిగి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ` మాకకు శక్తి, సిద్ధి పెరుగుతాయి. ` శరీరంలో వాతం, పిత్తం, కఫం చెడకుండా సౌమ్యావస్థలో ఉంచుతూ

Top