నేడే నా సీమోల్లంఘనం

షిర్డీ సాయిబాబా దేహత్యాగం చేసి ఈ దసరా నాటికి నూట మూడు సంవత్సరాలు. విజయదశమి (దసరా) నాడే బాబా దేహత్యాగం చేశారు. అందుకే ప్రతి సంవత్సరం దసరా నాడు బాబా పుణ్యతిథిగా భావించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు భక్తులు. షిర్డీలో ఈ సందర్భాన్ని పురస్కరించిన విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. 1918వ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, అక్టోబరు 15వ తేదీ, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సాయిబాబా భౌతిక శరీరాన్ని విడిచారు.

పిల్లల ఆటపాటలు

ఉడతా ఉడతా ఉడతా ఉడతా హూత్‍ ఎక్కడికి వెడతావు హూత్‍ సంతకు వెడతాను హూత్‍ ఏమిటి తెస్తావు హూత్‍ బెల్లం తెస్తాను హూత్‍ బెల్లం తెచ్చి నాకిస్తావా హూత్‍ నేనివ్వను పో! థూ అరటి మొలిచింది ఆదివారం నాడు అరటి మొలిచింది సోమవారం నాడు సుడివేసి పెరిగింది మంగళవారం నాడు మారాకు తొడిగింది బుధవారం నాడు పొట్టి గెల వేసింది గురువారం నాడు గుబురులో దాగింది శుక్రవారం నాడు పచ్చగా పండింది శనివారం నాడు చకచకా గెలకోసి అబ్బాయి అమ్మాయి అరటిపండ్లివిగో అందరికీ పంచితిమి అరటి అత్తములు. అఆలు దిద్దుదాం అఆ అఆ అఆ, అఆలు దిద్దుదాం అమ్మ

బహ్మమెచ్చిన జ్యేష్ఠం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో ఆరో మాసం- జూన్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది మూడో మాసం. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసమని పేరు. జ్యేష్ఠ మాసం నెల రోజులు బ్రహ్మను ఆరాధించాలని అంటారు. తెలుగు మానం ప్రకారం జూన్‍ నెల.. వైశాఖ - జ్యేష్ఠ మాసాల కలయిక. జూన్‍ 10వ తేదీ వరకు వైశాఖ మాస తిథులు..

ఉత్తరాయణం

మాతృదేవోభవ తెలుగు పత్రిక మే సంచికలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అందించిన విశేషాలు ఎంతో బాగున్నాయి. ముఖ్యంగా పురాణాల్లోని అమ్మతనానికి అద్దం పట్టే తల్లి పాత్రలను పరిచయం చేయడం చాలా బాగుంది. ప్రతీ పేజీలో ఇచ్చిన వివరాలు చదివించాయి. ఇప్పటి వరకు మాకు తెలియని కొన్ని పురాణ పాత్రలు, అమ్మగా వారి ఔన్నత్యం గురించి కూడా తెలుసుకోగలిగాము. - కె.వెంకటేశ్‍, రాజారవీంద్ర, పీహెచ్‍.భాను, ఆర్‍.విక్రమ్‍, టి.కవిత- హైదరాబాద్‍, శివప్రసాద్‍- తిరుపతి,

యోగభాగ్యాలు

ఈ కాలంలో భోగభాగ్యాలు ఉండటం గొప్ప కాదు. ఆరోగ్యంగా ఉండటమే మహా భాగ్యం. అందుకే మన పెద్దలు ఏనాడో చెప్పారు ఆరోగ్యమే మహా భాగ్యమని.. భావితరాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నెన్నో నియమాలు, పద్ధతులు ఏర్పరిచారు. అటువంటి వాటిలో ఉత్తమోత్తమైనది- యోగా. అందుకే ఇది యోగభాగ్యాల కాలం. పతంజలి మహర్షి ఈ లోకానికి ఒక అపురూపమైన కానుకగా అందించిన అద్భుతమైన ఆరోగ్య మంత్రమిది. యోగాను ఆచరించి, సాధికారికంగా బోధించింది ఆయనే. పతంజలి మహర్షి ఉద్బోధించిన అష్టాంగ యోగం ఒక రాజమార్గం.

Top