ఉత్తరాయణం

బైడెన్‍ పాఠం తెలుగు పత్రిక జనవరి సంచికలో అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‍పై ఇచ్చిన ముఖచిత్ర కథనం చాలా ఇన్‍స్పిరేషనల్‍గా ఉంది. జీవితం ఎవరికీ పూలబాట కాదని, కాకపోతే, నవ్వుతూనే ముళ్లబాట ప్రయాణాన్ని సాగించాలనే విషయం ఆయన జీవితాన్ని చదవడం ద్వారా అర్థమైంది. జీవితం చరమాంకంలో అత్యున్నత పదవిని అధిష్టించిన ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. - రాఘవేంద్ర ప్రసాద్‍, సీహెచ్‍.అరవింద్‍, టి.కనకరాజు, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు నల్ల కలువ

సూర్య నమస్కారాలు- ప్రయోజనాలు

సూర్య నమస్కారాలు శారీరక, మానసిక ఆరోగ్యానికే కాక ఆధ్యాత్మిక వికాసం కలిగించడంలోనూ విశేషంగా పని చేస్తాయి. వీటి వల్ల కలిగే అతి ప్రధాన ప్రయోజనం- క్రమశిక్షణ. ఎలాంటి పనిలో ఉన్నా, ఎంతటి హడావుడిలో ఉన్నా ఉదయమే సూర్య నమస్కారాలు చేయడానికి పది నిమిషాలు కేటాయించుకుంటే చాలు ఆ సమయం ఒక ‘శక్తి కేంద్రం’గా మారుతుంది. అదే చివరికి జీవనశైలికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. కేవలం పది నిమిషాల్లో ఫుల్‍ బాడీ

సూర్య నమస్కారాల్లో పన్నెండు (12) రకాల ఆసనాలు ఉన్నాయి.

ప్రణామాసనం (నమస్కారాసనం) మంత్రం: ఓం మిత్రాయ నమ: నిటారుగా ప్రార్థన భంగిమలో నిలుచుండాలి. రెండు పాదాలు ఒకదానికి మరొకటి తాకుతుండాలి. చేతులు నమస్కార ముద్రను చూపుతుండాలి. కొద్ది నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్ఛ్వాసలను చేయాలి. ప్రయోజనం: ఈ ఆసనం వల్ల మనసు సూర్యాభివందనాలను అనువుగా మారుతుంది హస్త ఉత్తానాసనం మంత్రం: ఓం రవయే నమ: శ్వాసను లోనికి పీలుస్తూ రెండు చేతులను పైకెత్తి వీపు వైపు వెనక్కి వంచాలి. ప్రారంభదశలో ఉన్న సాధకులైతే కొద్దిగానూ,

సూర్యం వందే ఆరోగ్యకారకమ్‍

‘తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టు’.. ఈ నానుడి సంగతి తెలుసు కదా!. దీన్ని ఏ సందర్భంలో, ఎందుకు ఉపయోగిస్తారనే విషయాన్ని పక్కనపెడితే.. తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టడం మాత్రం మంచిదే సుమా! ఇంకో విషయం.. సాధారణంగా మనం దేవుడికి లేదా పెద్దలకు గౌరవసూచకంగా లేదా ఏదైనా కోరుకోదల్చినపుడు నమస్కారం చేయడం ఆచారం. కానీ, ఈ దేవుడికి నమస్కారం చేయడమే ఒక వరం. అదీ మామూలు వరం కాదు.. ఆరోగ్య

ఇటు బోధన.. అటు సామాజిక సేవ

బోధన రంగమంటే ప్రాణమిచ్చే జిల్‍.. 1970 సంవత్సరం నుంచి అదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లిష్‍ ప్రొఫెసర్‍గా కొనసాగుతున్నారు. జో బైడెన్‍ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రెండు పర్యాయాల్లో రెండో మహిళగా హోదాను అందుకుంటూ ఒకవైపు అధికారిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు తన వృత్తినీ సమాంతరంగా కొనసాగించారు జిల్‍. ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రాణం పెట్టే జిల్‍..

Top