పుష్య మాస విధులు
విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వయుజం. శివుడికి కార్తికం ప్రీతికరం. అలాగే, పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా తనను పూజించే వారి పట్ల శనీశ్వరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుడిని భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు




