రాణా మళ్లీ రణం చేసేనా

యువ నటుడు రానా దగ్గుబాటికి యుద్ధాలు బాగా అచ్చివచ్చినట్టున్నాయి. ‘బాహుబలి’లో, ఆ తరువాత వచ్చిన ‘ఘాజీ’లో రానా నేలపై, నీళ్లలో యుద్ధాలు చేసేశాడు. తాజాగా ‘1945’ అనే చిత్రంలో కూడా ఆయన కళ్లు చెదిరే యుద్ధ సన్నివేశాల్లో నటించనున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్పై ఉంది. తేజ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోందని, భారత్‍ - పాక్‍ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటు న్నారు. వీరిద్దరి కాంబి

అరవింద సమేత… వీరరాఘ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‍ దర్శకత్వంలో ఎన్టీఆర్‍ నటిస్తున్న సినిమాకు ‘అసామాన్యుడు’, ‘సింహనంద’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే ‘అరవింద సమేత - వీరరాఘవ’ అనే టైటిల్‍ను ధృవీకరించారు. ఇక, ఈ చిత్రంలో ఎన్టీఆర్‍ చిత్తూరు యాసలో డైలాగులు చెప్పనున్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాకు చెందిన పెంచల దాసు (‘కృష్ణార్జున యుద్ధం’లో ‘దారి చూడు మామా’ అనే గీతాన్ని రాసి, పాడిన కళాకారుడు) ఎన్టీఆర్‍కు

సావిత్రితో తనకు పోలికలు ఉన్నాయట

‘మహానటి’లో సావిత్రి పాత్ర పోషించిన కీర్తిసురేశ్‍ ఈ సినిమా చేశాక తాను సావిత్రికి ఫాన్‍ అయిపోయానని చెబుతోంది. అంతేకాదు తామిద్దరికీ పోలికలు కూడా ఉన్నాయని అంటోంది. అవేమిటంటే- తనకు ఈత కొట్టడం అంటే మహా ఇష్టమట. క్రికెట్‍, కార్లు అన్నా పిచ్చి అట. సావిత్రికి కూడా సరిగ్గా ఇవంటేనే ఇష్టాలని ఆమె కుమార్తె విజయ చాముండేశ్వరి ద్వారా తెలిశాక అబ్బురమని అనిపించిందని కీర్తి చెబుతోంది. ఈ పోలికలు కలవడం వల్లే

రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం ఈ నెల దూర ప్రయాణాలు అధికంగా ఉండటం వల్ల శరీరం అలసిపోతుంది. అనారోగ్యం ఇబ్బంది పెడ్తుంది. శత్రువులు హాని చేయాలని చూస్తారు. వ్యాపారాలు సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెడ్తారు. నెల మధ్య నుంచి డబ్బు విషయంలో ఇబ్బందులుంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. నెల చివర్లో ఉద్యోగంలో కోరుకున్న అభివృద్ధి పొందగలుగుతారు. మొదటివారం

పరమ గురువు దక్షిణామూర్తి

దక్షిణామూర్తి ఈశ్వరాలయాల్లో దక్షిణ దిక్కున విలసిల్లే దైవం. ఆయన గురువులకు గురువు. నిత్య యవ్వనుడు. మౌనముద్రలో నిశ్చలంగా ఉపదేశించే మహాయోగి. శాంతమూర్తి. చిద్విలాసుడు. అటువంటి సచ్చిదానంద మూర్తినే స్మరించుకుంటూ చేసి ఈ స్తోత్ర రచన గంభీరమైన శైలిలో నడుస్తుంది. సకల ప్రాణుల సృష్టి - స్థితి - లయాలకు కారణభూతుడైన పరమ గురువున తన కవితాధారతో స్తుతించడానికే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ రచన చేసినట్టు

Top