12-12-1950

ఒక తేదీనే టైటిల్‍గా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే- అది సూపర్‍స్టార్‍ రజనీకాంత్‍ పుట్టిన తేదీ. ఇందులో రజనీకాంత్‍ నటించడం లేదు కానీ, ఆయన చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. ఐదుగురు రజనీ అభిమానులు ప్రతి రోజునూ తమ అభిమాన హీరో పుట్టిన రోజు కింద ఎలా సెలబ్రేట్‍ చేసుకున్నారనేదే ఈ కథాంశం. తమిళనటుడు సెల్వ దర్శకత్వంలో

అతిలోకసుందరి రెడీ!

మామ్‍’ సినిమా జనాదరణ పొందడంతో శ్రీదేవి తరువాత ఏ ప్రాజెక్ట్ చేయబోతోందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల ఆమె ఏ ఫంక్షన్‍కు వెళ్లినా, ఎక్కడ కనిపించినా మీడియా అదే విషయాన్ని అడుగుతోంది. అయితే, దీనిపై ఆమె నోరు మెదపడం లేదు కానీ, శ్రీదేవి నెక్టస్ ప్రాజెక్టుకు ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్టు సమాచారం. గతంలో సూపర్‍ డూపర్‍ హిట్‍ అయిన ‘మిస్టర్‍ ఇండియా’కు సీక్వెల్‍గా ‘మిస్టర్‍ ఇండియా-2’ తెరకెక్కించడానికి

రాశి ఫలాలు

మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వ్యాపారంలో కొంత ప్రతికూలత, సామాన్య ఫలితములు, శత్రుమూలక ధననాశము. బంధువైరం, ప్రయాణ అసౌఖ్యం, గృహసౌఖ్యం తగ్గుట, శరీరమందు ఉష్ణతాపములు. సుబ్రహ్మణ్య ఆరాధనచే శారీరక మానసిక ఆందోళనలచే విముక్తి. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు సంతానం విషయంలో ముందంజ, ధనలాభము, ఇష్టకామ్యసిద్ధి. శరీరమున రోగములు తోలగి సౌఖ్యములు, బంధు మిత్ర సమాగమము. మనస్సునకు ఉల్లాసము. గృహమునకై జేయు ప్రయత్నములు అంతగా

పని పట్టుదలను పెంచండి

దిగులు లేదా నిరాశ మనల్ని చుట్టిముట్టినప్పుడు పరిసరాలను, పరిస్థితులను వేలెత్తి చూపిస్తాం. అవే మన దిగులకు, నిరాశకు కారణమైనట్టుగా వాటిని నిందిస్తాం. అవి మనకు తీరని కష్టనష్టాలు కలిగించాయని దుఃఖిస్తాం. అయితే, మనకు సంభవించిన కష్టాలు మనం చేసిన పనుల తాలూకు ఫలితాలేనని ఎంతకీ గ్రహించం. సంతోషం కలగడం లేదా అది దూరం కావడం అనేది మన చర్యల ఫలితమే. సంతోషం అనేది లేదా ఆనందం అనేది ఒక వస్తువు

ఉత్తరాయణ

భలేగా రా‘సినారె’... కవి, జ్ఞానపీఠ్‍ అవార్డు గ్రహీత డాక్టర్‍ సి.నారాయణరెడ్డి గారి గురించి చాలా మంచి విషయాలు తెలియ చెప్పారు. ‘రాజు మరణిస్తే విగ్రహాలు పెడతారు. కానీ, కవి పరమపదిస్తే అతను జనం నాలుకలపైనే ఉంటాడు’ అనే నానుడి సినారె విషయంలో నూటికి నూరుపాళ్లు అక్షర సత్యం. ఆయన తెలుగు వారు గర్వించదగిన సాహితీద్రష్ట. అత్యంత జనాదరణ పొందిన ఆయా సినిమా పాటలు.. ఆయన రాసినవే అని తెలిసి ఆశ్చర్యం కలిగింది.

Top