చరణా కింకిణులు ఘల్లుఘల్లుమన..
కవిత్వం నా మాతృభాష.. కవిత నా శ్వాస.. కవిత నా చిరునామా అని ప్రకటించి, ‘ఇతివృత్తం మానవత్వం’ అని ఉద్ఘాటించి, సతతహరితంగా సాహితీ సృజన చేసిన కవితా పథింకుడు.. తెలుగు కీర్తిని, తెలుగు యశస్సును, తెలుగు నుడికారాన్ని, తెలుగు అక్షరాన్ని, తెలుగు పలుకుబడిని ఏలుబడిగా చేసుకుని తనకు తానుగా జగతినంతటికీ వ్యాపించిన కవితా తపస్వీ.. నత్య ప్రగతిశీలి, అభ్యుదయవాది ‘సినారె’. ఆయన రాసిన కవితలు నిత్యనూతనం. నెత్తి మీద నీలి




