ఆయుర్వేదం రసాయన చికిత్స

ఏ ఆహార, విహార, ఔషధాలు సేవించడం వల్ల ముసలితనం రాకుండా ఉంటుందో, వ్యాధి నిరోధక శక్తిని పెంచి వ్యాధులు రాకుండా ఏ ఆహారం నివారిస్తుందో, వచ్చిన వ్యాధులను సమూలంగా నయం చేయగల చికిత్సా పద్ధతిని రసాయన చికిత్స అంటారు. మనం నిత్యం రసాయన గుణాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటున్నట్టయితే, రసాయ గుణాలు కలిగిన విహారాలు పాటించినట్టయితే, కొన్ని రసాయన గుణాలు కలిగిన ఔషధాలు సేవించినట్టయితే శరీర నిర్మాణానికి అవసరమైన మూలధాతువులైనటు వంటి

ఆయుర్వేదం.. వ్యాయామం

వ్యాయామం ప్రాధాన్యత గురించి ఆయుర్వేద గ్రంథంలో విపులంగా వివరించారు. శరీరానికి శ్రమను కలిగించే పనినే వ్యాయామం అంటారు. వ్యాయామం నిత్యం చేయడం వల్ల శరీరం కాంతివంతంగా ఉంటుంది. వ్యాయామం మంచి ఆకలి పుట్టిస్తుంది. సోమరితనం, బద్ధకం దరిచేరవు. శరీరం నిర్ధిష్ట ఆకృతి కలిగి ఉంటుంది. శ్రమించడానికి అవసరమైన శారీరక శక్తి, మానసిక శక్తి లభిస్తాయి. శరీరం ఉష్టంగానూ, శీతలంగానూ కాకుండా కాపాడుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. వ్యాయామం నిత్యం చేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు. అల్ప జంతువులు

ఆయుర్వేదం.. ఆరోగ్యం

నవంబర్‌ 2, 2021 ` జాతీయ ఆయుర్వేద దినోత్సవం ఆయుర్వేదం అంటే..? ఆయుర్వేదం అంటే` ఆయుష్షును గురించి తెలిపే శాస్త్రం. హితాం హితం సుఖందు:ఖ మాయుస్తస్య హితాహితమ్‌ మానంచ తచ్చ యతఓక్త మాయుర్వేద: స ఉచ్యతే ఆయుష్షుకు హితమైనది, అహితమైనది ఏమిటో తెలిపేదీ, సుఖమును కలిగించేది ఏదో, దు:ఖాన్ని కలిగించేది ఏదో వివరించేది మాత్రమే కాక, ఆయుష్షు పరిమితిని కూడా తెలియచెప్పే శాన్త్రమే ఆయుర్వేదం. ఆయుర్వేదం వల్ల మానవ జీవనానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఆయు: కామయమానేన, ధర్మార్థ సుఖసాధనం ఆయుర్వేదోపదేశేషు విధేయ: పరమాధర: ఆయువు గురించి

ఆయుర్వేదం` రసాయన చికిత్స ఉపయోగాలు

ఆయుర్వేదం సూచించిన మేరకు ఆహార, విహార, ఔషధ గుణాల నియమాలను పాటిస్తే కలిగే ప్రయోజనాలివి.. ి` రసాయన చికిత్స మనుషుల్ని తరుణ వయస్కులుగా చేస్తుంది. ` జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ` బుద్ధి, ధారణశక్తి పెరుగుతాయి. ` శరీరం మంచి వర్ఛస్సు, కాంతిని సంతరించుకుంటుంది. ` మంచి, మధురమైన కోకిల వంటి స్వరం లభిస్తుంది. ` దేహబలం పెరిగి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ` మాకకు శక్తి, సిద్ధి పెరుగుతాయి. ` శరీరంలో వాతం, పిత్తం, కఫం చెడకుండా సౌమ్యావస్థలో ఉంచుతూ

ఆరోగ్యభాగ్యం ‘వేగం’.. ఆపితే రోగమే!

ఆరోగ్యభాగ్యం ‘వేగం’.. ఆపితే రోగమే! ఆయుర్వేదం మనకు ప్రకృతి నుంచి లభించే ఔషధాల గురించే కాదు.. అంతకంటే ముఖ్యమైన జీవన విధానం గురించి ఎక్కువ చెప్పింది. ఏ రోగానికైనా మందులు మాత్రమే పరిష్కారం కాదు. కాబట్టి అసలు రోగాలే రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేదే మన ప్రాచీన ఆయుర్వేదం చెప్పింది. రోగం రాకుండా ఉండాలంటే నివారణ మార్గం ఏమిటో సూచించింది. ప్రాచీన ఆయుర్వేద గ్రంథంలో మందులూ మాకులూ కంటే 69 శాతం జీవన

Top