సూర్య కిరణం.. ఆరోగ్య తేజం
మాఘ శుద్ధ సప్తమి తిథి.. సూర్య జయంతి తిథి. మన్వాది దినంగానూ ప్రసిద్ధి. సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినం కనుక ఇది పితృ దేవతలకు ప్రియకరమైనది. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరమే. మన్వాది నాడు చేయాల్సిన తర్పణాదులను ఈనాడు చేయాల్సి ఉంటుంది. ఈ వైవస్వత మన్వాది తిథి