నివేదన
అటు ఉగాది.. ఇటు శ్రీరామ నవమి.. రాములోరి కల్యాణోత్సవ విందు కోసం ఎలాగూ వడపప్పు, పానకం వంటివి చేయక తప్పదు. అలాగే ఉగాదికి ఎలాగూ పచ్చడి చేసుకోవడం తప్పనిసరి. ఇవి కాకుండా ఈ రెండు పర్వాల సందర్భంలో ఇంకేం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇవీ ఒకసారి ప్రయత్నించండి. అటుకుల పొంగలి కావాల్సినవి: మందంగా ఉండే అటుకులు: పెద్ద కప్పు, బెల్లంపొడి: ముప్పావు కప్పు, నీళ్లు: అరకప్పు, పాలు: అరకప్పు, నెయ్యి: రెండు టేబుల్‍స్పూన్లు,




