సూర్య నమస్కారాలు- ప్రయోజనాలు
సూర్య నమస్కారాలు శారీరక, మానసిక ఆరోగ్యానికే కాక ఆధ్యాత్మిక వికాసం కలిగించడంలోనూ విశేషంగా పని చేస్తాయి. వీటి వల్ల కలిగే అతి ప్రధాన ప్రయోజనం- క్రమశిక్షణ. ఎలాంటి పనిలో ఉన్నా, ఎంతటి హడావుడిలో ఉన్నా ఉదయమే సూర్య నమస్కారాలు చేయడానికి పది నిమిషాలు కేటాయించుకుంటే చాలు ఆ సమయం ఒక ‘శక్తి కేంద్రం’గా మారుతుంది. అదే చివరికి జీవనశైలికి ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. కేవలం పది నిమిషాల్లో ఫుల్ బాడీ