మిక్కిలి వింతలు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక తాయిలమేదో తీసీ పెట్టమ్మా ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీ వచ్చానే- తియ్యా తియ్యని తాయిలమేదో తీసీ పెట్టమ్మా పిల్లిపిల్లా కళ్లుమూసి పీట ఎక్కింది కుక్కపిల్లా తోకాడిస్తూ గుమ్మమెక్కింది కడుపులోని కాకిపిల్ల గంతులేస్తోందీ తియ్యాతియ్యని




