ప్రకృతి పాఠం
నేర్చుకోవాలే కానీ ప్రకృతిని మించిన పరమ గురువు ఈ సృష్టిలో మరొకటి లేదు. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సినవి, అలవర్చుకోవాల్సినవి, మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ప్రకృతి నియమాన్ని పరిశీలిస్తే మనకు ఆరు విధులు కనిపిస్తాయి. అవి- పుట్టడం, పెరగడం, పోషించుకోవడం, ఉత్పత్తి చేయడం, క్షీణించడం.. చివరిగా మరణించడం. కొన్ని వృక్షాలు విత్తులు వేసినా, వేయకున్నా పుడమిపై వాటంతట అవే మొలకెత్తుతాయి. బీజాంకురంలో ఉన్న ఆహార శక్తిని వినియోగించుకుని మొలకెత్తిన మొక్క కొంత వరకు




