ప్రతి ధ్వని

ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు. రఘు అడిగే చిలిపి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా, నింపాదిగా సమాధానం చెబుతున్నాడు. అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు. దెబ్బ బాగా తగలడంతో ‘అమ్మా’ అని అరిచాడు రఘు. అతను అరవకున్నా ఆ కొండ ప్రాంతంలో మరోసారి ‘అమ్మా’ అనే శబ్దం వినబడటంతో రఘు ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దం కొండలలో నుంచి రావడాన్ని

బ్రహ్మ శిల్పి

స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలను అన్నింటినీ సృష్టించిన తనను భూలోక వాసులు గుర్తుపెట్టుకున్నారా? లేదా? అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడవుగా భూలోకానికి వెళ్లాలని అనుకున్నాడు. ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండటం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదు ఎంత? అని శిల్పిని అడిగాడు బ్రహ్మ.

అద్భుత ఫలాలు

శ్రీకృష్ణ దేవరాయల వారికి ఒకరోజు పొరుగు దేశపు రాజు కొన్ని ఫలాలను బహుమతిగా పంపించాడు. వాటితో పాటు ఆ రాజు ఒక లేఖ కూడా రాశాడు. ‘మహారాజశ్రీ శ్రీకృష్ణ దేవరాయల వారికి భక్తితో రాయునది.. మా దేశంలో తప్ప ఇంకెక్కడా కాయని అపురూపమైన అద్భుత ఫలాలను మీకు బహూకరిస్తున్నాను. వీటిని తిన్న వారు దీర్ఘాయుష్కులవుతారు. వారికి వృద్ధాప్య మరణమే తప్ప అకాల మరణం ఉండదు’ అనేది ఆ లేఖ సారాంశం. శ్రీకృష్ణదేవరాయల ముఖం

అమూల్య బహుమతి

ఒక ప్రముఖ వ్యక్తి వికాస నిపుణుడు ఉపన్యాసం ప్రారంభిస్తూ జేబులో నుంచి ఒక వెయ్యి రూపాయల నోటు బయటకు తీశాడు. ఆ గదిలో కనీసం రెండు వందల మంది వరకు ఉన్నారు. ఆయన అందరినీ ఇలా అడిగాడు- ‘ఈ వెయ్యి రూపాయల నోటు ఎవరెవరికి కావాలి?’. అంతే. చేతులు ఒక్కొక్కటిగా పైకి లేచాయి. దాదాపు అందరూ చేతులు పైకి ఎత్తారు. ‘నేను మీలో ఒకరికి మాత్రమే ఈ వెయ్యి రూపాయల నోటు

వింత పరిష్కారం

శ్రీకృష్ణ దేవరాయలు ఐదు వందల సంవత్సరాల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి. ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో, కావ్య రచనలో అంత నేర్పరి. ఈయనకు ‘సాహితీ సమరాంగణ సార్వభౌముడు’ అనే బిరుదు కూడా ఉండేది. అముక్తమాల్యద రాయల వారు రచించిన గొప్ప కావ్యం. శ్రీకృష్ణ దేవరాయలు వద్ద ఎనిమిది మంది గొప్ప కవులు ఉండేవారు. వారిని ‘అష్ట దిగ్గజాలు’ అని పిలిచేవారు. అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన,

Top