పిల్లల ఆటపాటలు
ఉడతా ఉడతా ఉడతా ఉడతా హూత్ ఎక్కడికి వెడతావు హూత్ సంతకు వెడతాను హూత్ ఏమిటి తెస్తావు హూత్ బెల్లం తెస్తాను హూత్ బెల్లం తెచ్చి నాకిస్తావా హూత్ నేనివ్వను పో! థూ అరటి మొలిచింది ఆదివారం నాడు అరటి మొలిచింది సోమవారం నాడు సుడివేసి పెరిగింది మంగళవారం నాడు మారాకు తొడిగింది బుధవారం నాడు పొట్టి గెల వేసింది గురువారం నాడు గుబురులో దాగింది శుక్రవారం నాడు పచ్చగా పండింది శనివారం నాడు చకచకా గెలకోసి అబ్బాయి అమ్మాయి అరటిపండ్లివిగో అందరికీ పంచితిమి అరటి అత్తములు. అఆలు దిద్దుదాం అఆ అఆ అఆ, అఆలు దిద్దుదాం అమ్మ