పిల్లల సంక్రాంతి పాట
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక గెలముంద నెలముంద కులుకుతూ వచ్చావు పలుకరింతా మంటె సంక్రాంతీ! నిలిచి మాటాడవే సంక్రాంతి పూరింటి పై నవ్వు బీర పూవుల మీద చలి ముసుగు కప్పావు సంక్రాంతీ చక్కిలిగింత పెట్టావు సంక్రాంతి పాల చిక్కుడు చిగురు కేలల్ల లాడింప నీలాలు చిలికావు సంక్రాంతీ నిగ్గులొలికించావు సంక్రాంతి వరిచేను