పిల్లల ఆటపాటలు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక సాధిస్తాం! తెలుగు తల్లి బిడ్డలం వెలుగు నింపు దివ్వెలం చేయిచేయి కలుపుతాం చెలిమితోడ మెలగుతాం జాతి గీతి పాడుతాం చదువులన్నీ చదువుతాం క్రమశిక్షణ పాటిస్తాం శ్రమదానం సాగిస్తాం పరిశుభ్రతను పాటిస్తాం ప్రగతిబాట పయనిస్తాం చక్కటి పాదులు చేసేస్తాం మొక్కలు ఎన్నో నాటేస్తం పచ్చదనాన్నే తెచ్చేస్తాం ప్రకృతి అందం పెంచేస్తాం స్నేహసుధలనే చిందిస్తాం శాంతిని




