విష్ణుశర్మ – పంచతంత్ర కథలు
పూర్వం గంగానదీ తీరాన గల పాటలీపుత్రం అనే పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకులు చదువు మీద శ్రద్ధ చూపకుండా ఎప్పుడూ ఆటపాటలతో కాలం గడిపేవారు. కొడుకులు ఇలా సోమరులు కావడం సుదర్శనుడికి బాధ కలిగించింది. వారికి చదువుసంధ్యలు నేర్పించాలని తలచి ఆయన తన పట్టణంలోని విష్ణుశర్మ అనే గురువుకు కబురు పెట్టారు. విష్ణుశర్మ రాగానే, రాజు తన బాధ చెప్పుకున్నాడు. ‘నా




