మహేశా పాపవినాశా

ఓం నమ: శివాయా నవనీత హృదయా తమ: ప్రకాశా తరుణేందు భూషా నమో శంకరా! దేవదేవ మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా భక్తియేదో, పూజలేవో తెలియనైతినే ।।భ।। పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా ।।భ।। మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా మంత్రయుక్త పూజచేయ మనసు కరుగునా ।।మం।। మంత్రమో, తంత్రమో ఎరుగనైతినే ।।మం।। నాదమేదో వేదమేదో తెలియనైతినే ।।నా।। వాదమేల పేదబాధ తీర్చరావయా స్వామీ ।।వా।। మహేశా

సంబరాలు పండుగులు

పిల్లలారా రండి అబ్బాయి అమ్మాయి లందరూ చేరండి మన పల్లె కీనాడు సంబ్రాలు పండుగలు ధన ధాన్య సమృద్ధి` సిరి సంపదల వృద్ధి మన పల్లె లోగిళ్ల పండుగలు జరపగా సంబ్రాలు పంచగా సుఖములకు సంతోష గీతులకు నిలయముగ కూర్చండి మన పల్లె రండిరా దండిగా నాట్యమాడే వేళ! భాగ్య దేవతలారా పరవశించండిరా! నీరెండలో గాలి వెండి తీగల కూర్చె పసిడి తీగల నద్దె పొద్దు పొడుపే వేళ! వెన్నెలల మెడలలో పూలు కై పేసింది మొదుగుల గుండెల్లో మోదుగలు పండెరా! అడవి గుబురులు తరులు క్రొక్కారు పూలతో కురిశాయి ముత్యాలు అతిథులెవరైన సరే ఆహ్వాన మందించి ఆసనా లివ్వండి ఆసనా లివ్వండి అర్థనగ్నత నిన్న సిగ్గులో ముంచింది ఇరుగు పొరుగులకిపుడు ఇద్దాము దుస్తులను బెంగేల పెద్దోడ పంట తల్లికి కొదవ లేదోరి చిన్నోడ చిన్నమ్మ

పిల్లల ఆటపాటలు

ఉడతా ఉడతా ఉడతా ఉడతా హూత్‍ ఎక్కడికి వెడతావు హూత్‍ సంతకు వెడతాను హూత్‍ ఏమిటి తెస్తావు హూత్‍ బెల్లం తెస్తాను హూత్‍ బెల్లం తెచ్చి నాకిస్తావా హూత్‍ నేనివ్వను పో! థూ అరటి మొలిచింది ఆదివారం నాడు అరటి మొలిచింది సోమవారం నాడు సుడివేసి పెరిగింది మంగళవారం నాడు మారాకు తొడిగింది బుధవారం నాడు పొట్టి గెల వేసింది గురువారం నాడు గుబురులో దాగింది శుక్రవారం నాడు పచ్చగా పండింది శనివారం నాడు చకచకా గెలకోసి అబ్బాయి అమ్మాయి అరటిపండ్లివిగో అందరికీ పంచితిమి అరటి అత్తములు. అఆలు దిద్దుదాం అఆ అఆ అఆ, అఆలు దిద్దుదాం అమ్మ

అమ్మవేళ్ల ఉంగరాలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక అమ్మా వేళ్లాకుంగారాలూ ఎంతో బాగున్నాయ్‍ రెండు రెండూ ఉంగరాలూ తీసీనాకియ్యీ ఉంగరాలూ పెట్టూకోనీ పెళ్లికి వెళతానూ గోరింటాకూ పెట్టూకోనీ పెళ్లికి వెళతానూ పట్టూచీరా కట్టూకోనీ పెళ్లికి వెళతానూ పట్టూ రవికా తొడుగూకోనీ పెళ్లికి వెళతానూ లడ్డూ మిఠాయి జిలేబీలూ నాకూ పెడతారూ ఒడ్డూ

పసందైన వసంతం

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక వసంతాన్ని చూడు! వసంతాన్ని చూడు- అది అసత్యాలు చెప్పదు దానికెన్ని గొంతులో- కోటి పికములేమో! వసంతాన్ని చూడు- అది అసత్యాలు చెప్పదు దానికెన్ని కన్నులో- కోటి పూవులేమో! వసంతాన్ని చూడు- అది అసత్యాలు చెప్పదు దానికెన్ని చెవులో- ఒక కోటి చిగురులేమో! వసంతరుతువంటేనే

Top