శివ… శక్తి… శ్రద్దభక్తి
తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం ఆరవది. ఆంగ్లమానం ప్రకారం పదవ మాసం (అక్టోబరు). ఈ నెలలో ఆశ్వయుజం మాసంలోని కొన్ని రోజులు, కార్తీక మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. దీపావళి, కార్తీక స్నానమారంభం, భగినీ హస్త భోజనం, నాగుల చవితి వంటి ఎన్నో పండుగలు, పర్వాలు ఈ మాసంలో నెలవై ఉన్నాయి. ఈ నెలంతా (అక్టోబరు- ఆశ్వయుజం - కార్తీకం) అటు శక్తి ఆరాధనకు, ఇటు శివారాధనకు




