అమెరికా ఎన్నికలు ఎన్నెన్నో విశేషాలు
ప్రపంచంలోనే అతి పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం- అమెరికా. అక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతుంది. అక్కడేం జరిగినా.. ఆసక్తిగా, ఉత్కంఠగా అంతర్జాతీయ సమాజం మొత్తం తొంగి చూస్తుంది. అటువంటి ఎన్నికలు ఏడాది పాటు సాగే సుదీర్ఘ పక్రియ.. ఆ ఎన్నికలో గెలుపొందబోయే అధ్యక్షుడు ఎవరనేది ఇంకెంత ఉత్సుకత కలిగిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. మన దేశంలో మాదిరి అక్కడ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నోటిఫికేషన్ వంటి




