ఐక్యత, ఆశావాదం, సత్యం
అమెరికన్లు విజ్ఞతతో ఎన్నుకున్నారు డెలావర్‌లోని విల్మింగ్టన్లో తమ పార్టీ అభ్యర్థులు అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికైన సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహించారు. ఇందులో బైడెన్ కంటే ముందు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత మూలాలున్న కమలా హారిస్ ప్రసంగించారు. తన మాటలతో పార్టీ మద్దతుదారులను ఆమె ఉత్సాహపరిచారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ‘‘ఈ ఎన్నికల్లో నా గెలుపు మహిళా లోకం సాధించిన విజయం. అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళను




