ఆ ఎనిమిదే కీలకం..
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. ఎన్నికల ప్రచారం సందర్భంగా అమెరికన్లకు పలు హామీలను ఇచ్చారు. దేశాన్ని నిర్మించే కార్మికులకు అండగా ఉంటానని, దేశంలో ప్రజల మధ్య విభజనలను తగ్గించే విలువలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇంకా కరోనా మహమ్మారి, జాతి అసమానతల నుంచి అమెరికా సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో కార్మికులకు కొత్త ఆర్థిక అవకాశాలు సృష్టిస్తానని, పర్యావరణ భద్రత, ఆరోగ్యం పొందే హక్కు, అంతర్జాతీయ సంబంధాలను పునరుద్ధరిస్తానని హామీనిచ్చారు.




