మానవ కృషి – మాధవ కృప

మానవకృషి, మాధవకృప యొక్క పరస్పర కలచాలనం నుండి ఈ జీవనకమలం వికసించింది. అందుకని, మనం చేయగలిగిన కృషి చేస్తూ, చేయలేని పనులను భగవంతుని కృపకు ఆనందంగా విడిచిపెట్టాలి. ప్రపంచంలో ఒక సాపేక్ష సిద్ధాంతం అమలులో ఉంది. సరదాగా దాన్ని ‘రంధ్ర సిద్ధాంతం’ అని పిలుచుకుందాం ఒక పంపు కింద ఖాళీ పాత్రను ఉంచి నీటిని వదలండి. కనిపించే ధారతోపాటు, ఆ పాత్రకు కనిపించని రంధ్రం ఉందనుకుందాం. అప్పుడు ఎంత నీరు

తెలుగు సంవత్సరాలు – శకాలు, యుగాలు

కొత్తపదాలు : స్వయం ప్రకాశం, పరిభ్ర మించు, యుగం, శకం, నవగ్రహాలు. నక్షత్రాలు, రాసుల గురించి ఇదివరకు తెలుసుకున్నారు. అంతరిక్షంలో సూర్యుడు ముఖ్య మైన గ్రహం అని కూడా నేర్చుకున్నారు. సూర్యుడు స్వయం ప్రకాశం గల గోళం సూర్యుని వల్ల వెలుతురు, వేడివచ్చి జీవరాసులు బ్రతుకగలుగు తున్నాయి. సూర్యుడి చుట్టూ కొన్ని గోళాలు తిరుగుతున్నాయి. వీటిని గ్రహాలంటారు. సూర్యు నితో కలిసి ఇవి తొమ్మిది. వీటినే నవగ్రహా లంటారు. అవి : 1.

ప్రాణం తీసిన దురాశ

సంస్క•త భాషలో అద్భుతమైన నీతి కథలను నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో పండిన మహానుభావులు రచించారు. ‘హితోపదేశం - మిత్రలాభం’లో నారాయణ కవి చెప్పిన గొప్ప నీతి ఉన్న చిన్న కథ ఒకటి ఉంది. దాని గురించి తెలుసుకుందాం. వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరు గల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్లి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించుకునే వాడు.

అణువణువున

సృష్టిలో ప్రతి విషయం గ్రహించడం చాలా సులభం. ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకునేందుకు మనకున్న మామూలు ఇంగితజ్ఞానం చాలు. ‘నేను దేవుడిని చూడగలనా’ అనే ప్రశ్న వేదాంతపరమైనది. సంతృప్తికరమైన సమాధానం ఎన్నటికీ రాదు. ఈ ప్రశ్న అడిగినవారికి దైవం గురించి సరైన నిర్వచనం తెలియదనుకోవాలి. వారు మనసులో దైవమంటే ఇది, అది అనే అభిప్రాయం ముందుగానే ఏర్పరచు కొని అడుగుతున్నారు. ‘దైవాన్ని చూడగలమా’ అనేది మీ ప్రశ్న. ‘దైవాన్ని తప్ప

పసిపాప పరమగురువు

తల్లీ బిడ్డల సహజీవనంలోని ఆధ్యాత్మిక బంధాన్ని అవగాహన చేసుకున్న వారికి ఏ మతగ్రంధమూ పఠించవలసిన అవసరం రాదు. ఏ ప్రవర్త బోధలతోనూ పనిలేదు. బాల్యమనే బంతిపువ్వు, అమాయకత్వపు కొమ్మతో భగవంతుడనే మొక్కను గట్టిగా పట్టుకుని ఉంది. అందుకే పిల్లలూ, దేవుడూ కల్లకపట మెరుగని కరుణామయులని కవులు కొనియాడారు. ఒకవైపు, ఏమీ తెలియని పాప అమాయ కత్వం, మరొక వైపు అన్నీ తెలిసిన అమ్మ జ్ఞానం. ఈ విరుద్ధద్వంద్వాల వింతబంధం అవగాహన చేసుకుంటే

Top