నీ పనే నీ దైవం!

లక్ష్యం లేదు.. ఏ దారిన వెళ్లాలో కానరాదు.. మంచిచెడులను బేరీజు వేసుకోగల విచక్షణ లేదు.. జీవన పరమార్థం ఏమిటో అసలే తెలియదు.. ఇదీ ఆధునిక మానవుడి దారీతెన్నూ లేని జీవన పయనం.. అర్జునుడు చేతిలోని ధనస్సును జారవిడిచాడు.. మనం మనలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆశావాదాన్ని వదిలేస్తున్నాం.. ఎదురుగా ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి పార్థుడు కంగారెత్తాడు.. శత్రువులను చంపడానికి చేతులు రాక దిక్కులు చూశాడు.. మనం భ్రమల బందిఖానాలో చిక్కుకుంటున్నాం.. భయాల ఊబిలో దిగబడిపోతున్నాం.. అది కురుక్షేత్ర సంగ్రామం.. ఇది హృదయక్షేత్ర సమరం.. హృదయమే వాటిక.. మనోయజ్ఞమే యజ్ఞ సంకల్పం.. మనిషిలా

దత్తాత్రేయుడికి ప్రియమైన మేడిచెట్టు ప్రత్యేకతలేమిటి?

దత్తాత్రేయుడు మేడిచెట్టు కిందే ఎందుకు ఉంటాడు? మేడిచెట్టు ప్రత్యేకతలేమిటి?. ఔదుంబర వృక్షమంటే మేడిచెట్టేనా? ఔదుంబర వృక్షమంటే మేడిచెట్టుకు గల మరో పేరు. దీనినే అత్తి చెట్టు అని కూడా అంటారు. ఈ వృక్షం మొదట్లో కొలువుండటానికి దత్తాత్రేయుడు ఇష్టపడతాడని అంటారు. ఆయన ఉండే చిత్రాలలో ఆవుతో పాటు నాలుగు శునకాలు ఉంటాయి. ఆయన వెనుక ఉండే వృక్షం మేడిచెట్టే. దత్తాత్రేయుడు

ఆధ్యాత్మిక స్ఫూర్తి ఆరోగ్య దీప్తి

సన్మార్గానికి తోవ చూపే అయ్యప్ప స్వామి దీక్ష ఏటా కార్తీక మాసం నుంచి అయ్యప్ప దీక్షల సందడి మొదలవుతుంది. మార్గశిర-పుష్య మాసాల వరకు ఈ దీక్షాధారణలు కొనసాగుతాయి. మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనంతో దీక్షను ముగిస్తారు. ఆరోగ్య దీప్తి.. సామూహిక సామాజిక స్ఫూర్తి.. సత్యం వైపు నడిపించే జ్యోతి మార్గం.. అయ్యప్ప దీక్ష. మోక్షాన్ని పొందడమే మానవ జన్మ పరమార్థం. ఆ మోక్షసాధనకు మనిషి చేసే ఆధ్యాత్మిక

అనసూయాత్రి సంభూత..అవధూత

దత్తాత్రేయుడు గొప్ప సన్యాసి. ఆయన పుట్టిన వారం బుధవారం. తిథి మార్గశిర శుక్ల చతుర్దశి. నక్షత్రం కృత్తిక. దత్తాత్రేయ దేవాలయాల్లో ఈనాడు కీర్తనలు సాగుతాయి. దత్తాత్రయుడు ఉగ్ర దేవత అని గర్గ సంహిత చెబుతోంది. ఆయన ఉగ్ర దేవత కాబట్టే దేశంలో ఆయన ఆలయాలు తక్కువగా ఉన్నాయని అంటారు. ఈయన పుట్టినది బుధవారమైనా గురువారమే ప్రియమైనదని అంటారు. మార్గశిర పౌర్ణమి నాటికి యమదంష్ట్రలనే కష్టదినాలు తుదముట్టినందుకు సంతోష సూచకంగా ఉగ్రదైవమైన దత్తాత్రేయుడికి ఈనాడు పూజలు ఆచారంలోకి వచ్చి

అంగిరస మహర్షి

బ్రహ్మ ముఖం నుంచి పుట్టిన వాడు అంగిరస మహర్షి. బ్రహ్మ మానసపుత్రులని అంటూంటారు కదా! అలాంటి మానస పుత్రులలో మూడవ వాడు అంగిరస మహర్షి. అంగిరస మహర్షి వేదమంత్రాలు నేర్చుకుని తపస్సు చేసి గొప్ప విజ్ఞానాన్ని, వివేకాన్ని పొంది గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్నాడు. కర్దమ ప్రజాపతి అనే ఆయన పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసి తొమ్మిది మంది కుమార్తెలను పొందాడు. అందులో శ్రద్ధ అనే పేరు గల అమ్మాయిని అంగిరస మహర్షికి

Top