సిగ్గూ.. ఎగ్గూ లేదా?!

మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం. ఊడే పంటి కింద రాయి

అంతూదరీ లేని కోరికలు

మహా భారంతలోని ఆదిపర్వంలో ఉటంకించిన యయాతి కథ మనిషిలోని కోరికలకు అంతం లేదని, దానిని మనిషి జయించగలగాలనే సత్యాన్ని తెలియచేస్తుంది. శివుడి కుమార్తె అశోక సుందరి, నహుష చక్రవర్తుల కుమారుడు యయాతి మహారాజు. ఇతడు పాండవులకు పూర్వీకుడు. గొప్ప విష్ణు భక్తుడు. పరాజయం ఎరుగని పరాక్రమశాలి. ప్రతిష్ఠానపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ పట్ల కూడా మోహం

నిర్మోహత్వం.. నిస్సంగత్యం

కథలు.. పిల్లలూ, పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతిని బోధిస్తాయి. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ మనలో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. నేర్చుకోవాలే కానీ, ప్రతి కథా ఎంతోకొంత నేర్పుతుంది. వాటిని తాదాత్యంతో చదివితే ఆధ్యాత్మికంగా తగిన ఫలితాలు కనిపిస్తాయి. అటువంటి ఆధ్యాత్మిక కథలను ఈ శీర్షికలో

గోధుమ రవ్వ చక్కెర పొంగ

సూర్యుడికి ఇష్టమైన నైవేద్యాలలో గోధుమ రవ్వ చక్కెర పొంగలి ఒకటి. ఇది ఆయనకు ప్రీతికరమైనదిగా చెబుతారు. రథ సప్తమి (ఫిబ్రవరి 19) సందర్భంగా ఆ ప్రత్యక్ష నారాయణుడికి భక్తిపూర్వకంగా సమర్పించుకునే నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ- అర కప్పు, పెసర పప్పు- అర కప్పు, పాలు- ఒక కప్పు, పంచదార- అర కప్పు, నెయ్యి- రెండు (2) టేబుల్‍ స్పూన్లు, యాలకుల పొడి- అర

సంక్రాంతికి రథం ముగ్గు ఎందుకు?

సంక్రాంతి సందర్భంగా ఊరంతా రథం ముగ్గులు వేసే సంప్రదాయం ఉంది. దీని వెనుక ఓ ఆంతర్యం ఉంది. మకర సంక్రాంతి వేళ ఆరోగ్య ప్రదాత, శుభాన్నిచ్చే సూర్యుడిని కొలుస్తారు. ఇళ్ల ముందు వేసే రథం ముగ్గులు.. ఆ సూర్యనారాయణుడి రథానికి ప్రతిరూపంగా భావిస్తారు. అంతేకాదు, ఒక ఇంటి ముందు వేసిన రథం ముగ్గును మరో ఇంటి ముందున్న రథం ముగ్గుతో కలుపుతారు కూడా. సూర్యభగవానుడి రథం ఊరూరా, వీధి వీధినా

Top