శూర్పణఖ
లోకంలో వలచిన వనిత కోసం పేరుకెక్కిన పురుషులు ఉన్నట్టే, మనసు పడిన మగవాని కోసం చరిత్ర సృష్టించిన స్త్రీలూ ఉన్నారు. మహోన్నత త్యాగాలతో, మరపురాని సాహసాలతో కొందరు పేరు పొందితే, మితిమీరిన స్వార్థాలతో, దారుణ దుర్మార్గాలతో మరికొందరు చరిత్రకెక్కారు. రామాయణంలో శూర్పణఖ ఈ రెండవ కోవకు చెందిన స్త్రీ పాత్ర. ఆమె ఏ ముహూర్తంలో రాముడిని చూసి మోహించిందో కానీ, ఆమె మోహం ఆ సీతారాముల దాంపత్యాన్ని చిందరవందర చేసింది. రావణుడి




