శ్రీవారికి కానుక.. ఆశీర్వాదాల వేడుక

వడ్డీకాసుల వాడికి ఎందరో భక్తులు. మదిలోని కోరికలు నెరవేరితే ఎందరెందరో కడతారు ముడుపులు. ఎన్నో రూపాల్లో చెల్లించుకుంటారు కానుకలు. స్థోమతకొద్దీ ఇస్తుంటారు కొందరు విరాళాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి భక్తుల రుణం ఉంచుకోవడం లేదు.. వారిచ్చిన విరాళాలు, కానుకలకు తగినట్టుగా ఇతోధికంగా సౌకర్యాలనూ కల్పిస్తోంది. దర్శన భాగ్యం నుంచి బహుమతుల వరకూ అందించి భక్తులకు ఆనందానుభూతులను పంచుతోంది. పది వేల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగా విరాళాలు, కానుకల రూపంలో అందచేసిన వారికి పలు రకాల సేవలు, దర్శనాలు,

స్వర్ణకూపం

ఒక పల్లెలో విక్రముడనే పేద కుర్రవాడు ఉండేవాడు. తన ఊళ్లో తనకు గడిచే ఎత్తు కనబడక, ఒక పట్నం వెళ్లాడు. బజారు మొనలో నిలబడి, కనిపించిన వారినల్లా ‘ఏమండీ! మీకు నౌఖరు కావాలా?’ అని అడుగుతుండే వాడు. ‘మాకు అక్కర్లేదంటే, మాకు అక్కర్లేద’ని వాళ్ల దారిన వాళ్లు పోయేవారు. పొద్దుగుంకే సమయానికి తళతళ మెరిసిపోతున్న జలతారు దుస్తులు వేసుకుని ఒక వర్తకుడు వచ్చాడు. దుస్తులు చూస్తే బాగా ధనవంతుడిలాగా ఉన్నాడు. ముఖం చూస్తే

ఏ తిథిలో ఏ దైవాన్ని పూజించాలంటే..

అజ్ఞానంతో కూడిన మనసులో జ్ఞానదీపం వెలిగించే మాసం కార్తీకం. ‘న కార్తీక సమో మాస:’ మాసాలలో కార్తికాన్ని మించినది లేదని అర్థం. ఇది స్కాంద పురాణోక్తి. ఈ మాసంలో మహా విష్ణువుకు కార్తీక దామోదరుడని పేరు. ఇక, పరమశివుడు కార్తీక మహాదేవుడిగా పూజలందుకుంటాడు. ‘విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచమ్‍’ అనే విష్ణత్వ వైభవం, ‘శివతరాయచ’ అనే పరమశివ వైభవం అంటూ అంతర్యామికి చెందిన రెండు వైభవాలను వేదం వర్ణించింది. అటువంటి శివకేశవులకు పరమప్రీతిపాత్రమైన కార్తీకంలో ప్రతి

సంవర్త మహర్షి

బ్రహ్మ మానసపుత్రుడయిన అంగిరసుడు తన ధర్మపత్ని శ్రద్ధ ద్వారా పొందిన కొడుకు సంవర్తుడు. సంవర్తుడు జ్ఞాని, యోగి, తపశ్శాలి, నిస్సంగి, నిర్మముడు, నిరుపమ శక్తి సంపన్నుడు. సంవర్తుడు ప్రపంచ విషయాలకు విరక్తుడై విరాగియై యోగీశ్వరుడై బంధువులు, మిత్రులు, శిష్యులు తన దగ్గరకు రాకుండా ఉండటానికి దిగంబరత్వాన్ని అవలంబించి, అరణ్యాల్లో తిరగడం మొదలుపెట్టాడు. పూర్వం మనువంశ రాజైన మరుదత్తుడు, ధర్మతత్పరతతో, దయాదాక్షిణ్యాలతో శక్తియుక్తుడుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది ఇంద్రుడికి అసూయ కలిగించింది. మరుదత్తుడిపై అసూయ పెరిగిపోయి ఏం

విభీషణుడు

రామాయణంలో విభీషణుడిది వివాదగ్రస్త శీలం. కష్టకాలంలో ఆయన స్వార్థబుద్ధితో స్వజనులను వీడి, శత్రుపక్షం చేరి తిన్నింటికే నిప్పు పెట్టాడని నిందిస్తారు కొందరు. కాదు- అన్నగారి దుర్మార్గాన్ని గర్హించి, అతనికి మంచి చెప్పి చెడ్డ అయి, ఆ రాముని మహత్వాన్ని, రానున్న ప్రమాదాన్ని దర్శించి అధర్మపక్షం వీడి, ధర్మపక్షాన్ని స్వీకరించిన పరమ ధార్మికుడని ప్రశంసిస్తారు మరికొందరు. అందులో ఏది నిజం? రెండూ రెండు భిన్న దృక్పథాలు. జీవితంలో పుట్టుకను బట్టి, ఉనికిని బట్టి,

Top