గోమాతను పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి?
ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! జనులు పాపాల నుంచి విముక్తి చెంద డానికి ఏదైనా మార్గాన్ని, తరుణోపాయాన్ని తెలపండి’ అని కోరిందట. గోమాతకు చేసిన పూజల వలన కలిగే ఫలితాల గురించి అప్పుడు పరమేశ్వరుడు ఆమెకు ఈ విధంగా చెప్పాడట. ‘పార్వతీ! గోమాత యందు సమస్త దేవతలు ఉన్నారు. గోవు పాదాల యందు పితృదేవతలు, కాళ్ల యందు సమస్త పర్వతములు, భ్రూ మధ్యమున గంధర్వులు, దంతముల యందు గణపతి, ముక్కున శివుడు,