బహ్మ కడిగిన పాదము
దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం వర్ణనాతీతం. ఏటా బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనాలపై ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తాడు. తనను ఆశ్రయించిన భక్తకోటికి వరదహస్తుడై అభయమిస్తాడు. రథాన్ని అధిరోహించిన కేశవుడిని దర్శించుకుంటే మళ్లీ జన్మలెత్తాల్సిన అవసరమే లేదంటారు. ప్రతి మనిషీ జన్మజన్మల సాధనలతో అందుకోవాల్సిన పారమార్థికం.. రథంపై ఊరేగే స్వామి వారిని చూస్తేనే కలుగుతుందని నమ్ముతారు. ముక్తి ఫలాన్ని భక్తులకు అందించే ఉత్సవమే బ్రహ్మోత్సవం.




