ముగ్గూ ముచ్చటా.
బ్రహ్మ దేవుడు నుదుటి రాతను గీతలుగా రాసినట్టే, ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటి వారి సంస్కారాన్ని, సంస్క•తిని తెలుపుతుందని అంటారు. ముగ్గు లేకుండా సంక్రాంతి లేదు. ముగ్గులు మన సంస్క•తిలో విడదీయరాని భాగం. ముగ్గు వేయడం అనేది అపురూపమైన కళ. ఇది తరతరాలుగా అమ్మమ్మలు, బామ్మల నుంచి వారసత్వంగా వస్తోంది. సంక్రాంతి వేళ ఇంటి ముంగిట ముగ్గులు వేసే విషయంలో తెలుగు పడుచులు, అమ్మాయిలు ముద్దుగుమ్మలైపోతారు. సూర్యుడు ఉదయించడానికి




