జూన్ లో అట్లాంటా ను దర్శించనున్న మాతా అమృతానందమయి

అమ్మ అని పిలువబడే మాతా అమృతానందమయి దేవి తమ ప్రేమ, మరియు ఆత్మత్యాగభరితము అయిన అసమాన కృత్యాల వలన ప్రపంచవ్యాప్తంగా లక్షలాది జనాలకు ప్రీతిపాత్రులయ్యారు. తమ వద్దకు వచ్చిన వారిని అమ్మ, తమ ప్రేమాలింగనంలో ఇముడ్చుకుని, దయతో ఆదరిస్తూ, జాతిమత భేదాలు చూడకుండా, ఎవ్వరు, ఎందుకు వచ్చారు అన్న విషయాలు ఎంచకుండా, అవధులు లేని ప్రేమను వారిపై కురిపిస్తారు. అతి సాధారణము, అదే సమయంలో అతి శక్తివంతము అయిన ఈ రీతిలో ఒక్కొక్కరిని ఆలింగనం చేసుకుంటూ వారి హృదయాలను వికసింపజేస్తూ అమ్మ ప్రపంచమంతటా లెక్కలేనంత మంది వ్యక్తుల
జీవితాలలో పరివర్తనను సృష్టిస్తున్నారు

గత 40 సంవత్సరాలలో, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 మిలియన్ల మంది వ్యక్తులను అమ్మ ప్రేమాలింగనం చేసుకున్నారు. 37 మిలియన్లు… మరి ఇంకా, ఇంకా లెక్కిస్తూనే -ఉన్నారు! ఆఫ్రికా, అమెరికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్‍ మరియు ఇతర ప్రాంతాల ఆరాధకుల ఆహ్వా నంతో, అమ్మ ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తూ, ప్రజల భావోద్వేగాలు సఫలీకృతమయ్యేటట్లు వారికి మార్గదర్శకంగా – ఉంటున్నారు. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యం, మహిళల మీద అత్యాచారాలు మరియు సమన్వయం లేని మతాలు వంటి అంతర్జాతీయ సమస్యలకు తన సునిశిత దృష్టి మరియు పరిష్కార మార్గాలను అందిస్తున్నారు.

అమ్మ దగ్గరు వచ్చే ప్రతి ఒక్కరిని దయతో ప్రేమాలింగనం చేసుకుంటారు. వారి నమ్మకాలు, వారి హోదా లేదా వాళ్ళు అమ్మ దగ్గరకు ఎందుకు వచ్చారు అనే వాటితో పనిలే••ఁండా – అమ్మ తన అనంతమైన ప్రేమను అందరితోనూ పంచుకుంటారు.

మరి ఇప్పుడు, అట్లాంటా వంతు… అమ్మ 11 పట్టణాల 2019 ఉత్తర అమెరికా పర్యటనలో అట్లాంటా ఒకటి; – ఉత్తర అమెరికాకు ఇది ఆమె 32వ పర్యటన.
అమ్మ చివరిసారి అట్లాంటాను 2017లో సందర్శించారు, అది అత్యంత విజయవంతమైన సౌత్‍ ఈస్ట్ పర్యటన. కిక్కిరిసిన హాలులో అమ్మ యొక్క స్ఫూర్తిదాయక మాటలు వినడానికి, ఆనందకరమైన భక్తి సంగీతంలో మునిగిపోవ డానికి మరియు ఆమె అద్భుతమైన ఒక ప్రేమాలింగనం కోసం వరుసలో నిలబడటానికి వేలమంది తరలివచ్చారు. ఈ -ఉచిత కార్యక్రమా లకు హాజరైన ప్రజలు విభిన్న మతాలకు చెందినవారు మరియు జీవితంలోని అన్ని కోణాలకు చెందినవారు. కొందరు దశాబ్దాలుగా ఆధ్యాత్మిక మార్గాలను అనుసరిస్తు న్నారు, మరికొందరేమో తమ జీవితంలో ఆధ్యాత్మిక పుస్తకాన్ని ఎన్నడూ కూడా ముట్టుకోనివారు. కొంతమంది వారి మానసిక, శారీరక లేదా భౌతిక బాధలను అమ్మ తగ్గిస్తారనే ఆశతో వచ్చారు. మరికొంతమంది కేవలం కుతూహలంతో, మరియు జీవితం కంటే గొప్పదైన ఈ అంతర్జాతీయ మానవతావాది ఎవరు అని తమంతట తామే కనుగొనేందుకు వచ్చారు.

కారణం ఏమైనప్పటికి, చాలామంది అమ్మ యొక్క దైవత్వ ఉనికిలో ప్రకాశవంతమైన అనుభూతిని మరియు ధారాళమైన ప్రేమాను భూతిని తాము పొందామని చెప్పారు. కొందరు వారి పాత గాయాలు ప్రక్షాళన అయినట్లుగా భావించి కన్నీళ్ళతో కదిలిపోయారు. మరికొందరు గొప్ప శాంతిని, ఆనందాన్ని అనుభ వించారు.
కార్యాచరణలో కరుణ
ఇతరుల అభివృద్ధికై అవిరామమూ అలుపెరుగని అమ్మ యొక్క సమర్పణ భావం, విశాలమైన దాతృత్వ కార్యక్రమాలు గల సంస్థల స్థాపనకు నాంది పలికింది. వీటి ద్వారా స్వార్థ సేవలో లభించే శాంతిసౌందర్యాలను ఎందరో కనుగొనగలుగుతున్నారు. సచేతన మరియు అచేతన వస్తువులన్నింటిలో పరమాత్మతత్త్వం -ఉన్నదన్నది అమ్మ – ఉపదేశం. సమస్తంలో అతఃగర్భితంగా -ఉన్న ఈ ఏకత్వాన్ని వీక్షించడం అనేది ఆధ్యాత్మికసారమే కాక సమస్త ఆవేదనలకు నివారణ సాధనం కూడా.
అమ్మ యొక్క -ఉదార ప్రేమాలింగనాలు చాలామంది జీవితాలనే మార్చివేస్తుంటాయి. అది అమ్మ యొక్క మానవతావాద పని అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇతరులను ప్రోత్స హించడం కోసం అమ్మ ఆవిరామమైన అంకిత భావం, ఎంబేసింగ్‍ ది వరల్డ్ అనే ప్రపపంచవ్యాప్త బ్యానర్‍ క్రింద భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తారమైన స్వచ్ఛంద కార్య క్రమాలకు నాంది అయింది. ఆహారం, ఆశ్రయం, విద్య, ఆరోగ్యం, మరియు జీవనోపాధి – ఈ ఐదు ప్రాథమిక అవసరాలతో ఎక్కడ, ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు పేదలకు సహాయపడుతూ ప్రపంచంలోని పేదల యొక్క భారాన్ని తగ్గించ డానికి ఈ సంస్థ సహాయం చేస్తుంది. అమ్మ మానవత్వం కోసం చేసే కృషి నమ్మశక్యం కానిది; భారతదేశమంతటా 45,000 గృహాలు నిర్మించ బడ్డాయి, 100,000 మంది మహిళలు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించటానికి సహాయ పడ్డారు. 2.6 మిలియన్ల మందికి – ఉచిత వైద్యం సంరక్షణ ఇచ్చారు, 100,000 మంది వితంతు వులకు పెన్షన్లు, అలాగే శారీరక మరియు మానసికంగా వెనుకబడిన వ్యక్తులకు కూడా, 1 మిలియన్‍ చెట్లు నాటారు, ఇంకా ఇలా జాబితా కానసాగుతూనే ఉంటుంది. 2004 సునామి వలన కేరళలో కొన్ని ప్రాంతాలు నాశనమైనప్పుడు, అమ్మ యొక్క సహాయక కార్యక్రమాలు కొన్ని గంటల లోనే వారికి అందించబడ్డాయి. 46 మిలియన్‍ డాలర్లు కేరళ బాధితులకు అందచేయబడ్డాయి. మరియు జపానులోని సునామి బాధితులకు 1 మిలియన్‍ డాలర్లు అందచేయబడ్డాయి. ఆమె మిషన్‍ వాస్తవంగా చరిత్రలో అత్యంత అద్భుతమైన మానవతా ప్రయత్నాలలో ఒకటి. ప్రపంచంలోని వేలాదిమంది ప్రజలు అమ్మ యొక్క సంస్థలకు స్వచ్ఛందంగా సేవ చేస్తారు. వివిధ రకాల మతాలు, జాతులు, మత మరియు మౌళిక సిద్ధాంతాల నుండి వచ్చిన -ఉన్నతాధికారులు, ప్రముఖులు, విద్యార్థులు, కుటుంబీకులు వీరిలో ఉంటారు.

ప్రేమ అమ్మ యొక్క మతం

అమ్మ ఉపదేశాలు విశ్వజనీయమైనవి. అమ్మ మతం గురించి మాట్లాడినప్పుడల్లా, తమ మతం ప్రేమ అని తెలిపారు. అమ్మ ఎవ్వరినీ భగవంతు డిని నమ్మమని అనరు. అంతేకాక, మతం మార్చుకోమని కూడా అనరు. వారు కేవలం తమ తమ నిజతత్త్వాన్ని గురించి తెలుసుకుని ఆ తత్త్వాన్ని విశ్వసించమని కోరు తారు. ఈ కార్యక్రమాల కారణంగా అమ్మ, హిందూ పునరుజ్జీవనోద్యమ పురస్కారం (1993) మరియు గాంధీ కింగ్‍ అవార్డు (2002) వంటి పలు అంతర్జాతీయ అవార్డులతో సత్కరింప బడ్డారు. 2010లో, ది స్టేట్‍ యూనివర్శిటీ ఆఫ్‍ న్యూయార్క్ నుండి అమ్మ గౌరవ డాక్టరేట్‍ పట్టాను పొందారు. ప్రపంచంలో ఆధ్యాత్మికంగా ప్రభావ వంతమైన 100 మంది జీవించివున్న వ్యక్తులలో ఒకరుగా అమ్మ వాట్కిన్స్ జాబితాలో స్థానాలను పొందారు. అమ్మ సందేశం సరళం – ఇదే మాతా అమృతానందమయి యొక్క ప్రత్యేకత మరియు అమ్మ తమ దైవతం మీద వాదనలు చేయరు. అమ్మ తన దగ్గరకు వచ్చే వారికి విస్తారమైన ప్రేమను అందిస్తారు మరియు వారు మానవత్వ సేవనలు అందించేలా వారిని ప్రభావితం చేస్తారు.

హిల్టన్‍, అట్లాంటాలో జూన్‍ 28, జూన్‍ 29న అమ్మ అట్లాంటాను సందర్శిస్తారు. ఇది – ఉచిత కార్యక్రమం మరియు అందరికీ అందుబాటులో ఉంటుంది. కార్యక్రమాల్లో స్ఫూర్తిదాయకమైన సంగీతం, ధనం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఉంటాయి మరియు అమ్మ ఆశీర్వాదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మ దర్శనం ఇస్తారు.
‘‘అమ్మకు ఇతరుల బాధలను తొలగించడం, తన కన్నీటిని తుడుచుకున్నంత సహజం.
ఇతరుల సంతోషమే అమ్మ సంతోషం.
ఇతరుల భద్రతే అమ్మ భద్రత.
ఇతరుల విశ్రాంతి, అమ్మ యొక్క విశ్రాంతి.
ఇదే అమ్మ యొక్క లక్ష్యం. మానవాళిని మేల్కొలిపే ఈ లక్ష్యం కోసం అమ్మ తన జీవితాన్ని అంకితం చేశారు.’’
-అమ్మ

Review జూన్ లో అట్లాంటా ను దర్శించనున్న మాతా అమృతానందమయి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top