ఆరోగ్య భాగ్య శివరాత్రి
మహా శివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఉండటం వెనుక ఎన్నెన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. మహా శివరాత్రి పర్వాన్ని నిర్వహించుకునే విషయంలో మూడు ముఖ్యమైన నియమాలు పాటించాలి. శివార్చన, ఉపవాసం, జాగరణ.. ఈ మూడూ శివరాత్రికి చాలా ప్రత్యేకమైనవి. శివార్చన శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. శివలింగాన్ని షోడశోప చారాలతో పూజించాలి. ఉపవాసం ఉపవాసం ఉండటం అంటే, శివరూపాన్ని ధ్యానిస్తూ, శివ నామ




