జన సమ్మోహన నేతకు ‘తెలుగు పత్రిక’ అక్షరాభిషేకం

మాట తప్పలేదు..
మడమ తిప్పలేదు..
దాదాపు పది సంవత్సరాల పాటు ప్రజల మధ్యనే జీవితం.. ప్రజలతోడిదే లోకం.. ప్రజలతోనే మమేకం..
అందరి గుండె చప్పుడూ విన్నాడు..
‘నేనున్నా’నంటూ భరోసానిచ్చాడు.
జనమంతా ‘రావాలి జగన్‍.. కావాలి జగన్‍’ అంటూ ముక్తకంఠంతో నినదించారు.
అది ఆంధ్ర దేశమంతటా ‘జగన్ని’నాదమై మారుమోగింది.
నవ్యాంధ్ర నవ యువ నాయకుడికి బ్రహ్మరథం పట్టింది.
కష్టాలనూ చిరునవ్వుతో స్వాగతించే నైజం..
తానెంచుకున్న బాటలో ఇబ్బందులెదురైనా మొక్కవోని ధైర్యం, దీక్షతో ముందుకు సాగే తత్వం..
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే సంకల్పం..
జన బలమే తన బలం..
ఇవన్నీ కలిపితే వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి.
విభజిత ఆంధప్రదేశ్‍ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జననేత జగన్‍మోహన్‍రెడ్డి ఇటీవల ఎన్నికల్లో సాధించిన విజయం అసాధారణం.. అనన్య సామాన్యం.. అనితర సాధ్యం.
జనం ఆయనను నమ్మారు. ఆయన జనాన్ని నమ్మారు. తనను గెలిపిస్తే ఆంధప్రదేశ్‍ మెడలో ‘నవరత్నాల’ హారం వేస్తానన్నారు.
‘హోదా’ కోసం యోధుడనై పోరాడతానన్నారు.
అవినీతి, అరాచకాలతో నిండిపోయిన పాలనకు ఒక్క అవకాశం ఇస్తే చరమగీతం పాడుతానని గర్జించారు.
ఇదంతా జనం విశ్వసించారు. ఆయనను అందలమెక్కించారు.
ఇప్పుడే ఆంధప్రదేశ్‍ మాత్రమే కాదు.. యావత్తు దేశం ఆంధ్రావని వైపు ఆసక్తిగా చూస్తోంది.
జగన్‍మోహన్‍రెడ్డి ఏం చేస్తారు?
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చేసిన మొదటి సంతకం నుంచి నేటి వరకు ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఓ సంచలనం.
ప్రకటిస్తున్న ప్రతి కార్యక్రమం పేదల మోములపై చిరునగవులు పూయిస్తున్న ఓ వసంతం.
ఆంధ్రా ప్రజలకు ఇప్పుడు నమ్మకం వచ్చేసింది. ఈ జననేతకు ‘ఒక్క చాన్స్’ కాదు.. పదేపదే అవకాశమివ్వాలన్నంతగా ఆయన పాలనను మెచ్చుతోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి గారికి ‘తెలుగు పత్రిక’ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతోంది.
ఈ నవ నేత పాలనతో ఆంధ్ర దేశం సుభిక్షం కావాలని, నేల సస్యశ్యామలం కావాలని, అందరి బతుకులు పండాలని, అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను జన సమ్మోహన జగన్‍మోహన్‍ రెడ్డికి ఆ దైవం అందించాలని, జగన్‍మోహన్‍ ఖ్యాతి నేలంతా పరుచుకోవాలని ‘తెలుగు పత్రిక’ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
-తెలుగు పత్రిక
యునైటెడ్‍ స్టేట్స్ ఆఫ్‍ అమెరికా.

Review జన సమ్మోహన నేతకు ‘తెలుగు పత్రిక’ అక్షరాభిషేకం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top