పవిత్ర ప్రతులు తాళ పత్రాలు

ప్రపంచం వేగంగా మారుతున్న క్రమంలో, ఆ వేగాన్ని పరిపుష్టం చేసుకోవడం కోసం, మరింత ముందుకెళ్ళడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాలెడ్జ్ సొసైటీగా పిలవబడుతున్న ఈ కాలంలో ప్రతి విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించడం అలవాటయింది. వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తువైపు దూసుకెళుతున్న మనిషి, తనకు ఊతంగా పనికి వచ్చే ప్రతి విషయం కోసం మూడు కాలాల్లోకి తొంగి చూస్తున్నాడు. తన మేథస్సుకు పనికి వచ్చే కొత్త విషయాల కోసం, తన

ఆత్మ చిందే సుధ నిజమైన జ్ఞానం

ఎన్నో రోజులుగా ఉత్తరాలు రాయాలని ప్రయత్నిస్తున్నా అలసిన చేతివేళ్లు రాయలేమని మొండికెత్తాయి. మెదడు కూడా సోమరితనపు సోయగాల మాయలో పడి ఏమీ అందివ్వలేనని మొరాయించింది. ఒక్కొక్కసారి నాకలాగే అని పిస్తుంది. ఏమీ చేయబుద్ధేయదు. శారదరాత్రుల్లో, వెన్నెలవేళల్లో అలాగే ఆకాశంవంక చూస్తూ, వెన్నెల దీవికి తగిలి పగిలిపోయే మేఘ నౌకల్లో ఊగుతూ, అక్కడక్కడ గతస్మ •తుల్లా మిణుక్కుమనే నక్షత్ర సౌవర్ణ కాంతుల్లో కలలు కంటూ, ఓంకారం మరచిన వంకర జీవిత వంపులను

వందనాలమ్మా… తల్లీ వందనాలమ్మా…

అమ్మ అన్నది ఒక కమ్మని మాట... అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. ఇవి కేవలం ఒక సినిమా పాటలోని వాక్యాలు మాత్రమే కాదు. అక్షరసత్యాలు. మనకు ప్రాణం పోసేది అమ్మ, మనం నేర్చుకోబోయే భాషకు తొలిపలుకు అమ్మ. గొప్పవాడికైనా, పేదవాడికైనా అమ్మ ఒడి ఒక్కటే, ఆమె ప్రేమలో, లాలిత్యంలో దొరికే మాధుర్యం ఒకటే. చిన్నతనంలో నడకను, ఎదిగిన తర్వాత నడతను నేర్పే అమ్మ పిల్లలు

విద్యా దానమే దానం

అన్నదానం, విద్యాదానం రెండూ శ్రేష్ఠమైనవే. ఆ రెంటి మధ్య అంతరాలను విశ్లేషించిన శ్లోకం. విద్యాదాన మహత్త్వం తెలిపే సుభాషితం ఇది. పేదలకు ప్రభుత్వం అందించే ఉచిత పథకాలు తాత్కాలిక ప్రయోజనాల్ని మాత్రమే అందిస్తాయి. వృత్తి విద్యలలో శిక్షణనిచ్చి, వారి నైపుణ్యాన్ని పెంచి, వారు సొంత కాళ్లపై నిలబడేలా చేస్తే, శాశ్వత ఫలితాలు ఉంటాయని అంతరార్థం. విద్యావ్యాప్తికి పెద్దపీట వేసే భారతదేశంలో అన్ని దానాలలో విద్యాదానం గొప్పదనే విషయం విదితమే. శ్లో।। అన్నదానం

SAT/ACT ఏవిధంగా సన్నద్ధం కావాలి

SAT లేదా ACT కు ఏ విధంగా సిద్ధం కావాలి? స్కూల్‍ విద్యార్థులకు ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఇది. తమ తమ కాలేజీల్లో చేరే క్రమంలో విద్యార్థులను వారు సాధించిన మార్కులను సబ్మిట్‍ చేయవలసిందిగా కాలేజీలు విజ్ఞప్తి చేస్తుంటాయి. హైస్కూలు విద్యను అభ్యసిస్తున్నప్పుడే SAT లేదా ACT ల గురించి ఒక అవగాహన, ఆలోచన కలిగి ఉండటం మీరు రాబోయే రోజుల్లో వేయబోయే ముఖ్యమైన అడుగులకు నాంది. విద్యార్థుల

Top