వందనాలమ్మా… తల్లీ వందనాలమ్మా…

అమ్మ అన్నది ఒక కమ్మని మాట… అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. ఇవి కేవలం ఒక సినిమా పాటలోని వాక్యాలు మాత్రమే కాదు. అక్షరసత్యాలు. మనకు ప్రాణం పోసేది అమ్మ, మనం నేర్చుకోబోయే భాషకు తొలిపలుకు అమ్మ. గొప్పవాడికైనా, పేదవాడికైనా అమ్మ ఒడి ఒక్కటే, ఆమె ప్రేమలో, లాలిత్యంలో దొరికే మాధుర్యం ఒకటే. చిన్నతనంలో నడకను, ఎదిగిన తర్వాత నడతను నేర్పే అమ్మ పిల్లలు చేసిన తప్పులను కడుపులో దాచుకుంటుంది. వారు గోరంత వాత్యల్యం చూపితే కొండంత సంతోషాన్ని పొందుతుంది. బిడ్డలు చెట్టంత ఎదిగి రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్లిపోయినా వారి క్షేమం కోసం ఎల్లప్పుడూ పరితపిస్తూనే ఉంటుంది. కన్నపేగుకు ఏచిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా మన కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను మన కళ్లెదుట నడయాడే ప్రత్యక్ష దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం భారతదేశంలో ఉంది. మే 12న ‘మాతృదినోత్సవం’ సందర్భంగా ఈ వ్యాసమాలిక.

కానీ పాశ్చాత్య దేశాల పద్ధతులు వేరు. వారి సాంప్రదాయాలు వేరు. విదేశాల్లో పిల్లలు ఎదగ గానే తల్లిదండ్రులను వదిలిపెట్టి స్వతంత్రంగా జీవించడం ప్రారంభిస్తారు. అమ్మను రోజూ చూసు కునే పరిస్థితులు లేకపోవడంతో, కనిపెంచిన తల్లి గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె గౌరవార్ధం ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారం (ఎక్కువ దేశాలలో) నాడు ఈ మాత•దినోత్సవాన్ని జరుపుకుంటారు. గ్రీస్‍లో ‘మదర్‍ ఆఫ్‍ గాడ్స్’ గా భావించే ‘రియా’ దేవతకు నివాళులు అర్పించే నేపథ్యంలో మొదటిసారిగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారని చరిత్రకారులు చెబుతున్నారు.

చరిత్ర

ప్రపంచమంతటా ఏటా మే రెండో ఆదివారం నిర్వహిస్తున్న ప్రపంచ మాత• దినోత్సవానికి సుదీర్ఘ చరిత్ర, నేపథ్యం ఉంది. ఈస్టరుకు ముందు ‘లెంట్‍ రోజులు’గా పరిగణించే నలభైరోజులలోని నాలుగో ఆదివారం నాడు ఇంగ్లాండులో తల్లులకు గౌరవ పూర్వకంగా ‘మదరింగ్‍ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జూలియవర్డ్ హోవే’ అనే మహిళ 1872లో అమెరికాలో తొలిసారిగా ప్రపంచశాంతి కోసం మాత•దినోత్సవం నిర్వహించాలని ప్రతి పాదించింది. సివిల్‍ వార్‍ గాయాల స్మ•తులను చెరిగిపోయేలా చేసేందుకు ‘మదర్స్ ఫ్రెండ్షిప్‍ డే’ నిర్వహించి, అందుకోసం ఎంతో క•షిచేసిన అన్నా మేరీ జర్విస్‍ అనే మహిళ 1905 మే 9న చని పోయింది. ఆమె కుమార్తె మిస్‍ జెర్విస్‍ మాత• దినోత్సవం కోసం విస్త•తంగా ప్రచారం చేయడం తో పాటు తన తల్లి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మే నెలలోని రెండవ ఆదివారం నాడు మాత• దినోత్సవాన్ని నిర్వహించింది. అమెరికాలో తొలి సారిగా 1910లో వర్జీనియా రాష్ట్రంలో మాత• దినోత్సవాన్ని జరిపారు. జెర్విస్‍ విస్త•త ప్రచారం మూలంగా 1911నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాత•దినోత్సవం జరపడం సాంప్ర దాయంగా మారింది.

ఫలితంగా దీన్ని అధికారికంగా నిర్వహించా లని 1914లో నాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‍ నిర్ణయించారు. కాలక్రమేణా ఇది ప్రపంచ మంతా వ్యాపించింది. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మాత•దినోత్సవాన్ని ఘనంగా జరుపు కుంటున్నారు.
అమ•తతుల్యమైన ప్రేమ, మమకారాలతో బిడ్డలను పెంచి పెద్ద చేసి, అహర్నిశలూ శ్రమించి వారికి బంగరు భవిత ఇచ్చి బదులుగా కాసింత అనురాగం, ఆప్యాయత తప్ప మరేమీ ఆశించని కరుణామయులైన మాత•మూర్తులకు మదర్స్డే సందర్భంగా వేల క•తజ్ఞతలు, శతకోటి వంద నాలు.’’

మన దేశంలో మాత•దినోత్సవ సంబరాలు

మాత•మూర్తుల పట్ల క•తజ్ఞతను, గౌరవాన్ని చాటుకుంటూ ప్రతి ఏడాది మే నెలలో జరిపే ఈ వేడుకలను ఇప్పుడిప్పుడే భారతీయులూ జరుపు కోవటం మొదలుపెట్టారు. అమ్మను ప్రేమించే, ఆమెను గౌరవించే ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఒక్కరోజు ఆమెకోసం కేటాయించేందుకు, ఏడా దికి ఒక్కసారి వచ్చే ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా జరిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సమా జంలో, కుటుంబ వ్యవస్థను కాపాడటంలో అమ్మలు పోషించే ప్రభావవంత మైన, స్ఫూర్తిమంత మైన పాత్రను గురించి చర్చించుకునేందుకు, అవగాహన కలిగించేందుకు నిర్వహించే ఈ సంబరాలు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో విభిన్నమైన తేదీలలో జరుగుతాయి. భారత్‍లో ‘మదర్స్డే’ని ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండవ ఆదివారం (ఈ ఏడాది, మే 12)నాడు జరుపుకుంటున్నారు.
ఇలా జరుపుకుంటున్నారు

అమ్మ గురించి, ఆమె గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఇటీవలి కాలంలో పాఠశాలల్లో ‘మదర్స్ డే’ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తల్లులను ముఖ్యంగా చిన్న పిల్లల తల్లులను ఈ వేడుకలకు ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థీ తమ తల్లి గురించి కొన్ని కవితలు, ఉపన్యాసం, వక్త •త్వం, పాటలు, డాన్సుల ద్వారా తమ తల్లుల గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఇంకా తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్‍ కార్డులు, ఇంకా ఇతర బహుమతు లను తమ తల్లులకు ఇస్తారు. క్రైస్తవులు మాత• దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజున వారు తమ తల్లుల కోసం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మదర్స్డేని కొన్ని దేశాల్లో సెలవుదినంగా పాటిస్తున్నారు. ఈరోజున తమ తల్లులను ఇంటి పనులు ఇతర బాధ్యతల నుంచి తప్పించి ఆ పనులు వారు చేసి ఆమెకు పూర్తి విశ్రాంతినిస్తారు. ఈ రోజున పిల్లలు తమ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడుపుతారు.

మదర్స్డేని ప్రత్యేకంగా జరుపుకోండిలా

కుటుంబంలో ప్రతి వ్యక్తీ ఎంతో ప్రత్యేకం. అందరిలోకీ అమ్మ మరింత ప్రత్యేకం. మనదైన ప్రపంచంలో మనకు అత్యంత ప్రత్యేకమైన, అత్యంత ప్రియమైన అమ్మ కోసం, ఆమె ఆనందం కోసం రోజువారీ జీవితానికి కాస్త భిన్నంగా ఇలా చేయ డానికి ప్రయత్నించి చూడండి. తద్వారా మీకు ఆమెపై ఉన్న ప్రేమ, ఆప్యాయతలను తెలియ జేయండి.
మొదటగా ఏ విషయం ఆమెను అత్యంత ఆనందపరచగలదో ఆలోచించండి. ఆ తరువాత దానిని అమలులో పెట్టండి.
బహుమతుల కన్నా మీతో సరదాగా, సంతో షంగా గడిపే సమయాన్నే ఆమె అమూల్యంగా భావిస్తోందా? అయితే ఆ రోజు మరే పనులు, వ్యాపకాలు పెట్టుకోకుండా ఆమెతో ఆత్మీయంగా గడపండి.

ఆమెకు నచ్చిన బహుమతులు ఇవ్వండి. అయితే షాపులు, మాల్స్లో దొరికే ఖరీదైన బహు మతుల కన్నా మీరు స్వయంగా తయారు చేసి ఇచ్చే బహుమతులే ఆమెకు ఇష్టమని తెలిస్తే మీ చేత్తో స•జనాత్మకంగా గ్రీటింగ్‍ కార్డుల వంటివి తయారు చేసి ఇవ్వవచ్చు.

తన పిల్లల ఫోటోలు ప్రింట్‍ చేసిన లాకెట్లు, తన పేరు లేదా ఫోటో ప్రింట్‍ చేసిన కాఫీ లేదా టీకప్పులు వంటివి ఇవ్వవచ్చు.
ఆమెకు ఇష్టమైన పూలు లేదా పండ్ల మొక్క లను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇంటిపని, తోట పనుల్లో సహాయం చేయవచ్చు. తనతో క్యారమ్స్, చెస్‍ లాంటి ఇండోర్‍ గేమ్స్ లేదా ఆమెకు ఇష్టమైన ఇతర ఆటలేమైనా ఆడవచ్చు.

తనకు నచ్చిన వంటకాన్ని లేదా ప్రత్యేకమైన వంటకాలను వండి తినిపించవచ్చు. బ్రేక్‍ఫాస్ట్కు, లంచ్‍కు బయటకు తీసుకెళ్లవచ్చు.
ఆమెలో మీకు నచ్చిన అంశాలేమిటో, ఆమె ద్వారా ఏమి నేర్చుకున్నారో, ఏ విధంగా స్పూర్తి పొందారో క•తజ్ఞతాపూర్వకంగా ఒక కాగితంపై రాసి చూపించి ఆమెను సంతోషపరచవచ్చు.

అసలు ఈ రోజును ఎలా గడపాలను కుంటుందో, ఈ వేడుకను ఎలా జరుపుకోవాలను కుంటుందో తననే అడిగి ఆ విధంగానే చేయడం వల్ల ఆమెను మరింత సంతోషంగా, ఆనందంగా చూసే అవకాశముంది.
అసలు ఈ ఒక్కరోజును మాత్రమే కాదు ప్రతి రోజు ఆమెను ప్రత్యేకంగానే చూడటం ఆమెతో ప్రేమగా, ఆత్మీయంగా గడపడం అమ్మకు మీరు ఇచ్చే, ఆమె తీసుకోగలిగే అతి పెద్ద అమూల్యమైన బహుమతి.

పురాణాల్లో ‘మాత•దేవతలు’

ప్రేమ, కరుణలను వర్షించే ప్రేమమూర్తులుగా మాత•త్వమనే పదానికే అర్థంగా, నిదర్శనంగా నిలిచిన తల్లులు మన పురాణాల్లో ఎంతోమంది కనిపిస్తారు. అలాంటివారిలో తలచుకోగానే మన కళ్లెదుట ప్రత్యక్షమయ్యే కొందరు మాత•మూర్తుల గురించి తెలుసుకుందాం.
పార్వతీ దేవి: ఆమె అమ్మల గన్న అమ్మ, శక్తి స్వరూపిణి. తన బిడ్డ ప్రాణం కోసం భర్త అయిన శివుడినే ఎదిరించి, ఆయనతో పోరాడి మరీ బిడ్డను బతికించుకున్న మాత•మూర్తి. తాను నలుగు పిండితో ప్రాణం పోసిన బాలుడికి, తన భర్త అయిన శంకరుడికి మధ్య జరిగిన తీవ్ర వాగ్వా దంలో బాలుడు ప్రాణాలు కోల్పోగా భోరున విల పించి, ఏనుగు తలైనా ఫరవాలేదు పిల్లవాడు ప్రాణాలతో తిరుగాడితే చాలు అని ఆరాటపడిన అమ్మ. శివుడి ఉపాయంతో తన బిడ్డను బతికించు కుని అతడిని చూసుకుని మురిసిపోయిన తల్లి పార్వతీదేవి. ఆ బిడ్డడే మన ఏకదంతుడైన వినాయకుడు.
సీతాదేవి: జనకుడి తనయ, శ్రీరాముడి పత్ని అయిన సీతాదేవి గర్భిణిగా తనను అడవిలో వదిలేసినప్పటికీ, ఆ బాధను, శోకాన్ని దిగమింగు కుని వాల్మీకి ఆశ్రమంలో ఇద్దరు కవలలు లవ కుశులకు జన్మనిచ్చింది. ఎన్ని కష్ట నష్టాలెదు రైనా తన కుమారులిద్దరినీ క్షత్రియపుత్రులు, ఇక్ష్వాకు వంశ వారసులుగా ఒంటరిగా పెంచి పెద్ద చేసింది.

యశోదాదేవి: దేవకీ నందనుడైన కన్నయ్యను తన ప్రేమ, వాత్యల్యాలతో యశోదా క•ష్ణుడిగా మార్చుకున్న ప్రేమమయి యశోదాదేవి. కన్నది దేవకీ దేవి అయినా క•ష్ణుడి బాల్యం అనగానే మనకు చటుక్కున స్ఫురించేది యశోదాదేవి పేరే. పాలు, వెన్నలతో పాటు ప్రేమ, వాత్సల్యాలను రంగరించి క•ష్ణుడిని పెంచి పెద్ద చేసింది. కన్నయ్య ఆడితే ఆనందపడిపోయి, పాడితే పరవశించి పోయి, పిల్లనగ్రోవి ఊదితే మైమరిచిపోయి అల్లరి చేస్తే ముద్దుగా కోప్పడి… ఇలా అతని బాల్య క్రీడ లతో, అల్లరి చేష్టలతో మాత•త్వాన్ని తనవి తీరా ఆస్వాదించిన తల్లి.. యశోదమ్మ. అయితే అన్న అయిన కంసుడి క్రౌర్యానికి వెరచి పొత్తిళ్లలోనే బిడ్డను వేరొకరికి అప్పగించవలసిన అగత్యం ఏర్పడినా ఎక్కడో ఒక చోట తన బిడ్డ క్షేమంగా ఉంటే చాలనుకుని పుట్టెడు శోకాన్ని గుండెల్లోనే దాచుకున్న శోకమూర్తి దేవకీదేవి కూడా ఈ సందర్భంగా స్మరణీయురాలే.

కౌసల్యాదేవి: దశరథ రాజు పట్టపురాణి, రామ చంద్రుడి తల్లి కౌసల్యాదేవి. సవతి కైకేయికి భర్త ఇచ్చిన వరం మూలంగా పద్నాలుగేళ్ల పాటు తన పుత్రుడికి దూరమై వేదనను అనుభవించిన మాత• మూర్తి. భర్త నిస్సహాయత, కైకేయి దురాలోచన ఫలితంగా రాముడు వనవాసానికి వెళ్లి తాను శోకంలో మునిగిపోయినప్పటికీ తనయుడి పిత•వాక్యపరిపాలనకు లోటు రాకూడదన్న సదా శయంతో, సయంమనంతో వ్యవహరించిన తల్లి కౌసల్యాదేవి.
సుమిత్రాదేవి: భర్త దశరథుడు ఇచ్చిన వరానికి, సవతి కైకేయి దురాశకు కౌసల్యలాగే బలైన మరో తల్లి సుమిత్రాదేవి. భర్త కైకేయికి ఇచ్చిన వరమే తన పాలిట శాపం కాగా పుత్రుడి ఎడబాటును కొన్నేళ్ల పాటు మౌనంగా భరించిన తల్లి సుమిత్ర. అన్నగారితో పాటు తాను కూడా వనవాసానికి వెళతానంటూ లక్ష్మణుడు పట్టుబట్టిన వేళ…. అత డిని వారించకుండా రాముడిని కూడా తన కుమా రుడిలాగే భావించి అతడి పిత•వాక్యపరి పాలనకు తన వంతు సహకారాన్ని అందించిన సహ•దయు రాలు సుమిత్రాదేవి.
అలాగే పేరుకు భరతుడు తన పుత్రుడైనా రాముడినే తన బిడ్డగా భావించి అపరిమితమైన ప్రేమ, వాత్సల్యాలతో అల్లారుముద్దుగా రామ చంద్రుడిని పెంచింది కైకేయి.
అనుక్షణం రాము డినే కలవరించి, పలవరించేది. అలాంటిది మంధర చెప్పుడు మాటలు విని తన కుమారుడు భరతుడి భవిష్యత్తుకోసం రాముడిని వనవాసానికి పంపింది. ఫలితంగా కన్నకొడుకే తనను చూసి ఛీత్కరించుకుంటే ఎంతగానో ఏడ్చింది. ఆ తరు వాత ఎంతో పశ్చాత్తాప పడింది. అయినప్పటికీ ఆమె కూడా ఈ సందర్భంలో గుర్తుచేసుకోదగిన వ్యక్తే.
వకుళమాత: శ్రీక•ష్ణుడి బాల్యం మాత్రమే తాను చూడగలిగానని అనంతరం అతని వద్ద ఉండలేకపోయానని, పుతప్రేమను పంచలేక పోయానని, వాపోయిన యశోదమ్మకు మరు జన్మలో ఆ అవకాశం కల్పిస్తానని వాగ్దానం చేశాడు క•ష్ణ పరమాత్ముడు. అన్నట్లుగానే యశోదమ్మ, వకుళ మాతగా జన్మించగా తాను శ్రీ వేంకటేశ్వరుడిగా అవతరించి పుత్రుడిగా ఆమె ప్రేమను అందు కున్నాడు. పూర్వజన్మలో తాను కోరిన కోరికను ఈ జన్మలో నెరవేర్చేందుకు పుత్రుడిగా తన వద్దకు ఏతెంచిన గోవిందుడిని తన లాలనతో, వాత్స ల్యంతో ఆదరించి తనలోని మాత•త్వభావనను పరిపూర్ణం చేసుకున్న మహనీయ మాత•మూర్తి వకుళమాత.

Review వందనాలమ్మా… తల్లీ వందనాలమ్మా….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top