అద్దం మీద ఆవగింజ నిలవదు

తెలుగునాట నోరు నోరు తెరిస్తే సామెత. పాట పాడినా, ఆట ఆడినా అది కూడా సామెత రూపంలో నిలవాల్సిందే. మనకంటే ఒక మేలిమి సంప్రదాయం, సంస్క •తి ఉన్నాయనే విషయాన్ని ఈ సామెతలు నిరంతరం గుర్తు చేస్తుంటాయి. ‘పొట్టకైనా బట్టకైనా భూదేవే’ అని పల్లెవాసుల నమ్మిక. ‘కళ్లమున్న నాల్గొ ద్దులు గంజి. అంగడున్న నాల్గొద్దులు ఉప్పు’ వంటి సామె తలు జానపదాల నుంచి పుట్టినవే. పల్లె జీవనంలో భేషజాలు, ఆడంబరాలు

పెద్దల మాట విందాం !

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యాస్పరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. పరుగెత్తి పాలుతాగేకన్నా

తేవోయి నీలాలు తేవోయి వెన్నెలలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక కొండ మీది.. కొండ మీది గుండు జారి కొక్కిరాయి కాలు విరిగె దానికేమందు? వేపాకు పసుపూ, వెల్లుల్లి పాయ నూనెమ్మ బొట్టు - నూటొక్కసారి నూరి పూటకొక్కసారి పూయవోయ్‍ నారింజ కాయ నారింజ కాయ నిన్ను చూడగానే నా నోరూరు తొక్కవిప్పి తినగ అబ్బబ్బ పులుపు

కార్తీక పౌర్ణమిలో.. గిరి ప్రదక్షిణ

కార్తిక పౌర్ణమి వేళలో గిరిప్రదక్షిణ ఆధ్యాత్మిక దివ్యానుభూతి! పున్నమి వెన్నెలలో అరుణాచలం హిమగిరిని తలపిస్తుంది. ఆ కొండ సాక్షాత్తూ, పరమ శివుడి ప్రతిరూపమని భక్తుల విశ్వాసం. శ్రీగిరి ప్రద క్షిణలో అడుగడుగునా దర్శనీయ స్థలాలే. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలే శ్వర ఆలయం పంచభూతలింగాల్లో ఒకటి. కొండల మీద అనేక ఆలయాలు ఉండవచ్చు. ఏకంగా కొండే శివస్వరూపమైన క్షేత్రం మాత్రం ఇదొక్కటే. ఇక్కడ... ఆలయ ప్రదక్షిణ ఎంత పుణ్యప్రదమో, గిరి ప్రదక్షిణ అంతకు

కుందేలు తెలివితేటలు

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

Top