ఉపమన్యు మహర్షి

ఉపమన్యు మహర్షి కృతయుగంలో వ్యాఘ్రపాదుడనే మహర్షి పెద్ద కొడుకు. ఉపమన్యుడి తమ్ముడు ధౌమ్యుడు. ఇద్దరూ ఒకనాడు బంధువుల ఇంటికి వెళ్లి పరమాన్నం తిన్నారు. ఇంటికొచ్చి అలాంటి పరమాన్నం చేసిపెట్టు అని తల్లిని కోరారు. అవసరమైన దినుసులు లేవని, కాబట్టి ఆ కోరిక తీరడానికి ఈశ్వరుడి గురించి తపస్సు చేయాలని, ఆయన ఏం అడిగినా ఇస్తాడని తల్లి చెబుతుంది. శివుడు ఎలా ఉంటాడని ఉపమన్యుడు తల్లిని అడిగాడు. తనకు తెలిసినంత ఆమె చెప్పింది.

మహా పతివ్రత మండోదరి

మండోదరి మహా పతివ్రత. మండోదరి అంటే ‘మండనం యస్యస ఉదరం’.. అంటే` సన్నని నడుము గలది అని అర్థం. తెలుగులో మండోదరి అంటే భూమి వంటి పొట్ట కలదని అర్థం. భూమి వంటి ఉదరం అంటే, సంతాన సాఫల్యత గల ఉదరము అని భావం. ఈమె రావణుడి భార్య. విశ్వకర్మ కుమారుడైన మయబ్రహ్మ కుమార్తె ఈమె. మహా శిల్పి అయిన మయబ్రహ్మ.. హేమ అనే ఒక దేవకన్యతో కలవగా మండోదరి

అమ్మా.. అన్నీ నీవే!

భవానీ అష్టకంలో అమ్మ గురించి, ఆమె గొప్పతనం గురించి, ఆమె అమృతమయమైన ప్రేమ గురించి ఎంతో గొప్ప వర్ణనలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని శ్లోకాలు.. న తాతో న మాతో న బన్ధు ర్న దాతా న పుత్రో న పుత్రీ నభృత్యో న భర్తా న జాయా న విద్యా న వృత్తి ర్మ మైవ గతిస్త్వం గతిస్త్వం త్వ మేకా భవాని ‘‘అమ్మా! ఓ భవానీ! నాకు తల్లిగానీ, తండ్రిగానీ, కొడుకు గానీ, కూతురుగానీ,

ధర్మదీక్షకు సిద్ధమేనా?

ఒకసారి బుద్ధుడు విశాల •వటవృక్షం కింద కూర్చుని జ్ఞానబోధ చేస్తున్నాడు. అందరూ భక్తిశ్రద్ధలతో ఆ బోధనలు వింటున్నారు. అంతలో అక్కడికి రాజభటులు ఒక దొంగను తీసుకువచ్చారు. రాజభటులు బుద్ధుడికి వినయంగా నమస్కరించి- - ‘భగవాన్‍! ఈ దొంగ గతంలో మీ వద్ద ధర్మదీక్ష తీసుకున్నట్టు చెబుతున్నాడు. మహారాజు వాస్తవం ఏమిటో కనుక్కోమని మమ్మల్ని పంపారు’ అని చెప్పారు. బుద్ధుడు ఆ దొంగకేసి కొద్దిసేపు చూశారు. ‘నీ పేరు ఏమిటి?’ అడిగాడు బుద్ధుడు. ‘ధర్ముడు’ అని చెప్పాడు దొంగ. ‘నువ్వు

ఆ అయిదే కారణం

ఒకసారి బుద్ధుడు తన ధర్మాన్ని శ్రావస్తీ నగర పరిసరాలలో ఉపదేశిస్తున్నప్పుడు ఒక సంపన్నుడు ఆయన వద్దకు వచ్చాడు. అనేక రోగాలతో బాధపడుతున్న ఆయన చేతులు జోడించి ఇలా అన్నాడు- ‘బుద్ధుడా! నీకు చేయవలసిన విధంగా ప్రణామం చేయనందుకు నన్ను క్షమించండి. ఊబకాయం, నిద్రమత్తు, ఇంకా ఇతర అనారోగ్య కారణాల వల్ల నేను బాధలు పడుతున్నాను. శరీరంలో ఏ అవయవాన్ని కదిలించినా తీవ్రమైన నొప్పులు’ అని వాపోయాడు. అతని చుట్టూ అలముకుని ఉన్న విషయ భోగాలను

Top