తిరుమల దర్శిని

‘శ్రీనివాసా..’ అంటే చాలు మనసంతా తేలికైపోతుంది. ‘ఆపద మొక్కులువాడా..’ అని పిలిస్తే చాలు క్షణంలో మనసంతా ఆనందంతో నిండిపోతుంది.. అలుపూ సొలుపూ లేకుండా ‘గోవింద’ నామాలను స్మరిస్తూ శ్రీవారిని మెట్ల మార్గంలో వెళ్లి దర్శించుకోవాలంటే.. సులువైన మార్గాలున్నాయి. గతంలో వేసవి సెలవుల్లోనూ, ఇతరత్రా సెలవు రోజుల్లోనూ తిరుమలలో రద్దీ ఉండేది. ఇప్పుడు సెలవులతో నిమిత్తం లేకుండా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఎప్పుడు చూసినా రద్దీ గణనీయంగా ఉంటోంది.

తెలుగు ‘పాట’వం

కరేణ కిం మాం గృహీతుం తే హరే ఫణిశయ్యా సంభోగ ।।పల్లవి।। జలే తవ సంచరణ మిహాధన్‍ స్థలే భవనం తవ సంతతం బలే రూప ప్రకటన మతులా చలే స్థానం చల చల రమణా ।।కరేణ।। పదే భువన ప్రామాణ్యం తవ హ్రదే ప్రచురణవిహరణ మిదం ముదేమునీనాం మోహనం తనుం మదే తవ నర్మ చ మాం విసృజ ।।కరేణ।। స్మరే విజయ స్తవ విమలతురగ ఖురే రతిసంకుల రచన పురే తవ విస్ఫురణం వేంకట గిరేపతే తే ఖేటాఘటిత ।।కరేణ।। అవతారిక: తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవేంకటేశ్వరుడిపై రచించిన కీర్తనల్లో ఇదో సరస

శ్రీరామ్‍ గారి లేఖలు

జీవితంలో మనం మాట్లాడుకునే చాలా విషయాలు, చెప్పుకునే చాలా కబుర్లు.. ఇవన్నీ మాకెందుకని అనుకుని ఏదో క్షణంలో అనుకుంటాం. కానీ, అవన్నీ ఇప్పుడు కాక పోయినా, ఎపుడైనా జీవితంలో అందరికీ అవసర మైనవే. అందుకే రాస్తున్నాను. ఈ విషయాలన్నీ ఎవరికీ అవసరం లేకపోయినా నాకు చాలా అవసరం. అందుకే నేను రాసే చాలా ఉత్తరాలు చూడటానికి ఇతర వ్యక్తులకు రాస్తున్నట్లు అనిపించినా, నిజానికి అవి నాకు నేను రాసుకున్న ఉత్తరాలు. ఇవన్నీ

రుషి పీఠం

శ్రీలు పొంగిన పుణ్యభూమి అయిన భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు అగస్త్య మహర్షి. అగస్త్యుని జన్మ నిజంగా చాలా విచిత్రమైనది. అగ్నిదేవుడూ, వాయుదేవుడూ.. ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్లున్న ఒక పాత్రలో నుంచి పుట్టాడు అగస్త్య మహర్షి. అందుకే ఆయనకు కలశజుడు, కుంభసంభవుడు, ఔర్వశేయుడు, మిత్రావరణ పుత్రుడు, వహ్నిమారుత సంభవుడనే అనేక పేర్లు ఉన్నాయి. అగస్త్య మహర్షికి చిన్నతనంలోనే ఉపనయనం, ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం వంటివన్నీ దేవతలే చేసేశారు.

పురాణ పాత్రలు

సత్యవ్రతుని కథ మిక్కిలి ఆసక్తికరమైనది. ఒకనాడు జమదగ్ని తదితర మునులందరూ ఒకచోట సమావేశమై ఏ దేవతా పూజ శీఘ్రంగా ఫలించగలదని చర్చించుకోసాగారు. మునిజన సమావేశంలో ఉన్న లోమశ మహర్షి ‘దేవీ పూజ శీఘ్ర ఫలదాయకం. అంతకు మించినది లేదు. అందుకు సత్యవ్రతుని కథే ఉదాహరణగా చెప్పుకోవచ్చు’ అన్నాడు. ‘ఎవరా సత్యవ్రతుడు? ఏమా కథ?’ అని మిగిలిన మునులందరూ ముక్తకంఠంతో అడిగారు. అప్పుడు లోమశ మహర్షి సత్యవ్రతుని కథను ఇలా చెప్పాడు- పూర్వం దేవదత్తుడనే

Top