బాలాత్రిపుర సుందరిదేవి
ఆంధప్రదేశ్‍లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం.. శ్రీశైల క్షేత్రానికి తూర్పుద్వారంగా భాసిల్లుతోన్న దివ్యక్షేత్రం. ఇక్కడ బాలాత్రిపుర సుందరిదేవి, త్రిపురాంతకేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం లేదా ఇక్కడ పెట్టే అన్నదానాన్ని స్వీకరించడం వల్ల అక్షయమైన పుణ్యఫలం లభిస్తుందని అంటారు. ఇక్కడ అమ్మవారు బాలిక రూపంలో స్వయంభువుగా వెలిశారు. ఇది శక్తిపీఠంతో సమానమైన మహిమ గల క్షేత్రం. త్రిపురాంతక క్షేత్రంలో అన్నదానం చేయడం లేదా అన్నదాన కార్యక్రమాలకు విరాళాలు




