ధ్యాన బలం
కార్తీక పున్నమి రోజు. ఆకాశం నిర్మలంగా ఉంది. వెన్నెల పిండారబోసినట్టు ప్రకాశిస్తోంది. జేతవనంలోని బౌద్ధారామం దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆ రోజు ఉదయం నుంచి ఎందరెందరో భిక్షువులు జేతవనానికి వస్తూనే ఉన్నారు. మళ్లీ మూడు నెలల తరువాత ఆరామం భిక్షువులతో నిండుగా కళకళలాడుతోంది. బౌద్ధ భిక్షువులకు ఆషాఢ పున్నమి నుంచి కార్తీక పున్నమి వరకు వర్షావాస కాలం. ఈ నాలుగు నెలల కాలంలో ఓ మూడు నెలలు ఆషాఢ పున్నమి నుంచి